గణతంత్ర దినోత్సవ సందర్భంగా విద్యుత్ సౌధలో ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ రంగంలో
రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలిపేందుకు ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ సంస్థలు చేస్తున్న నిరంతర కృషి అభినందనీయమని అన్నారు. మా
సహజ వనరులతో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి ఆంధ్రప్రదేశ్ అనువుగా ఉందనీ, అందుకోసమై రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందనీ అన్నారు. 2023 లో విశాఖపట్నం లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో ఇంధన రంగం నిమిత్తమై సుమారు పది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 52,015 కోట్ల విలువ గల ప్రోజెక్టులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని ఆయన తెలిపారు. మార్చి నాటికి 800 ఎంవీ కెపాసిటీ తో ఎస్ఎస్టీపీఎస్ ప్రారంభం అవుతుందని చెప్పారు.
ఈ ప్రాజెక్టుల ద్వారా 12,585 మందికి ఉపాధి కల్పన జరగబోనుందనీ, 19.58 లక్షల మంది వ్యవసాయ వినియోగదారులకు ఉచిత విద్యుత్ అందించగలమనీ, రాష్ట్ర ప్రభుత్వం 7000 మెగావాట్ల సౌర విద్యుత్‌ను రూ2.49లకు (ఒక యూనిట్ కు) కొనుగోలు చేసేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుందనీ అన్నారు. సిబ్బంది పాల్గొన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ నిరంతరాయంగా అందించాలనే బలమైన లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.