ఎప్పుడప్పుడా అని ఊరిస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేసింది . మొత్తం 6100 పోస్టులోతో జీవో విడుదల చేసిన ప్రభుత్వం. ఇందులో 2299 స్కూల్ అసిస్టెంట్, 2280 ఎస్జీటి పోస్ట్లు,1264 టీజీటీ పోస్ట్లు , 215 పీజీటీ పోస్ట్లు , 42 ప్రిన్సిపాల్ పోస్ట్లుతో ఈ జీవోను విడుదల చేసిన ప్రభుత్వం. ఈ నెల 22వ తారీకు వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు, 21వ తారీకు వరుకు ఫీజు చెల్లించవచ్చు. మార్చి 5 తారీకు నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మార్చి 15 నుంచి 30 తేదీ వరకు ఆన్లైన్ మోడ్ లో డీఎస్సీ పరీక్ష నిర్వహణ. ఏప్రిల్ 15న డీఎస్సీ ఫలితాలు. అభ్యర్థులకు మేలు చేకూర్చేలా 2018 సిలబస్ తోనే పరీక్ష నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం. జనరల్ కేటగిరి అభ్యర్థులకి గరిష్ట వయస్సు 44 సంవత్సరాలు, రిజర్వు కేటగిరి అభ్యర్థులకి మరో అయిదు సంవత్సరాలు సడలింపు ఇచ్చారు.
జగన్ ప్రభుత్వంలో ఇప్పటిదాకా 1998,2008,2018 డీఎస్సీ ల మొత్తం 13,272 పోస్ట్లు భర్తీ చేసారు . 2018లో బాబు ప్రకటించిన ప్రక్రియ మొత్తం జగన్ ప్రభుత్వం వచ్చాక జరిగింది . 1998 లో బాబు పాలనలో ఎంతో మంది క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వకపోగా దాని తర్వాత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా వాళ్ళని పట్టించుకున్న పాపానపోలేదు. ఇప్పుడు ప్రకటించిన 6100 ఉద్యోగాలుతో మొత్తం కలిపితే 19,372 ఉద్యోగాలు కల్పించింది జగన్ ప్రభుత్వం.