ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిపై దాడి జరిగితే ప్రత్యర్థులెవరైన సరే ఆ ఘటనను ఖండించే ప్రయత్నం చేస్తారు. కానీ టీడీపీ మాత్రం అలాంటి ప్రయత్నాలు చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఓ వైపు ప్రధాని మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దాడి ఘటనను ఖండిస్తూనే సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షింస్తుడగా టీడీపీ సోషల్ మీడియా మాత్రం ఈ దాడి ఘటనపై బురదజల్లే ప్రయత్నం చేస్తుంది.
గత ఎన్నికల్లో కోడి కత్తి డ్రామా ఆడారని ఈ ఎన్నికల్లో కొత్త డ్రామాకి తెర లేపారని టీడీపీ ఆఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా విషప్రచారం మొదలుపెట్టింది. హుందాగా వ్యవహరించాల్సిన సమయంలో ఇంత ఘోరంగా దిగజారిపోవడాన్ని టీడీపీ శ్రేణులు కూడా అంగీకరించడం లేదు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుపై అలిపిరి వద్ద బాంబు దాడి జరిగినప్పుడు అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిందితులను శిక్షించాలని ధర్నాకు దిగి చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. కానీ నేటి టీడీపీ సోషల్ మీడియా ముఖ్యమంత్రిపై జరిగిన దాడిని ఎంజాయ్ చేస్తూ విషప్రచారం చేస్తుండడాన్ని ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు.
టీడీపీ సోషల్ మీడియా వేధింపుల వల్ల గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఆ ఘటనలో కూడా టీడీపీ సోషల్ మీడియా బరితెగించి గీతాంజలి అనే మహిళ వ్యక్తిగత జీవితాన్ని బయటకు లాగి లాభం పొందాలనే ప్రయత్నం చేసి అభాసుపాలైంది. తన ఆఫీషియల్ హ్యాండిల్స్ ద్వారా గీతాంజలి చావును కించపరుస్తూ పోస్టులు పెట్టడం, ఓ ఫేక్ వీడియోను రూపొందించి గీతాంజలికి వ్యతిరేకంగా ప్రచారం చేసి రాజకీయంగా లబ్ది పొందాలని ప్రయత్నం చేసినా టీడీపీ సోషల్ మీడియాను ప్రజలంతా ఛీ కొట్టడంతో సీఎం జగన్ పై దుష్ప్రచారానికి కొత్త మార్గాలు వెతుక్కుంది.
అధికారం కోసం అసత్య ప్రచారాలకు తెరతీసిన టీడీపీ సోషల్ మీడియా తాజాగా సీఎంపై జరిగిన దాడిపై కూడా దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టింది. రాజకీయాల్లో హుందాతనానికి పాతరేస్తూ ఆఖరికి ఫేక్ వీడియోలు పోస్టులను అధికారిక టీడీపీ హ్యాండిల్స్ లో పోస్ట్ చేస్తుండడంతో టీడీపీ ప్రవర్తిస్తున్న తీరును చూసి టీడీపీ శ్రేణులే ఆ పార్టీని ఛీకొడుతున్నాయి.