ఏపీ ప్రజలు 2024 ఎలక్షన్ లో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న నియోజకవర్గంలో కుప్పం మొదటి స్థానంలో ఉంటుంది. ఇక్కడ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోటి లో వున్నారు. కుప్పం చంద్రబాబు నాయుడికి కంచుకోట ఇక్కడ ఒక్కసారి కూడా ఓడిపోలేదు అలాంటి చోట ఈరోజు చంద్రబాబు నాయుడిని ఓడిస్తాము అంటూ ప్రత్యర్ధి పార్టీ అయినా వైసీపీ నేతలు సవాలు విసురుతున్నారు .దానికి కారణం 2019 లో చంద్రబాబు రెండు రౌండ్లలో వెనకబడటం, కుప్పంలో జరిగిన సర్పంచ్, ఎంపీటీసీ,జడ్పీటీసీ,మున్సిపాలిటీ ఎలక్షన్లో 85% వైసీపీ పార్టీనే గెలుచుకోవడంతో చంద్రబాబు నాయుడి గెలుపోటముల పై ఇప్పుడు అందరూ ఆసక్తిని కనబరుస్తున్నారు.
చంద్రబాబు నాయుడు కూడా తన గెలుపు మీద కొంత ఆందోళన పడుతున్నారని చెప్పొచ్చు. గతంలో సంవత్సరానికి ఒకసారి కూడా కుప్పంకు రాని చంద్రబాబు గత రెండు సంవత్సరాలుగా ప్రతి మూడు నెలలకు ఒకసారి కుప్పం పర్యటనకు రావడం వచ్చినప్పుడు రెండు మూడు రోజులు కుప్పంలోనే వుండి ప్రచారం చేసుకుంటూ వచ్చారు. అయినా కూడా టీడీపీకి ఇంతకు ముందులా నియోజకవర్గ ప్రజల నుండి ఆశించినంతగా స్పందన రాకపోవడంతో మరింత ఆందోళన పడుతున్నారు. మొదటిసారి కుప్పం నామినేషన్ కు భువనేశ్వరి వచ్చి రెండు రోజులు ప్రచారం చేసి నియోజకవర్గ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఆలాగే చంద్రబాబు నాయుడు తన పార్టీ ప్రచారాన్ని కుప్పం నుండి మొదలు పెట్టి ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు.
ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలవడం అత్యంత కీలకం కాబట్టి పార్టీ తరపున బలమైన నాయకులను, కీలకమైన కార్యకర్తలను ఒక వెయ్యి మందిని ఎంపిక చేసి ప్రతి రెండు బూతులకు ఒకరిని ఇంచార్జిగా నియమించారు. వారితో ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నారు.అలాగే డబ్బులను వరదలా పారిస్తున్నారని ప్రాథమిక సమాచారం.
ఇటు వైసీపీ అభ్యర్థి భరత్ ఈ ఐదు సంవత్సరాల్లో చేసిన ప్రతి సంక్షేమంను , అభివృద్దినీ, ముఖ్యంగా కుప్పం ప్రజల కోరిక అయిన కృష్ణ జలాలను కుప్పంకు తీసుకువచ్చి వారి చిరకాల కోరిక నెరవేర్చిన అంశాలను ప్రచారం చేస్తూ దూసుకెలుతున్నారు . భరత్ కు అండగా ప్రతి కార్యకర్త, నాయకుడు సమిష్టిగా ప్రచారం చేస్తున్నారు, వీరికి అండగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సలహాలు సూచనలు ఇస్తూ సమన్వయం చేస్తున్నారు . ఎమ్మెల్యే కూడా అవ్వకుండా ఇంత అభివృద్ధి భరత్ చేశాడు రేపొద్దున భరత్ గెలిస్తే మంత్రి కూడా అవుతాడు అని వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు.
ఇప్పుడు ఇదే మరింతగా టీడీపీనీ , చంద్రబాబును భయపెడుతోంది.పరిస్థితులు చూస్తుంటే టీడీపీకి గెలుపు అవకాశాలు రోజు రోజు కి సన్నగిల్లుతూ చంద్రబాబుకు డేంజర్ బెల్ మోగిస్తున్నాయి అని చిత్తూరు జిల్లా రాజకీయ పండితులు అభిప్రాయ పడుతున్నారు.