ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్ ఈనెల 22న పులివెందులలో నామినేషన్ వేయనున్నట్లు సమాచారం. 18న నోటిఫికేషన్ రానుంది. దీంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 21న సొంత నియోజకవర్గానికి చేరుకుని, రెండు రోజులు అక్కడే ఉండి పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నట్లు సమాచారం. పులివెందుల నియోజకవర్గంలో తన తరపున సతీమణి భారతికి ప్రచార బాధ్యతలు అప్పగించి, జగన్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర కొనసాగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ నెల 21న ఇడుపులపాయలో జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి వైయస్సార్ కు నివాళి అర్పిస్తారు. అనంతరం అక్కడి నుండి నేరుగా పులివెందుల వెళ్లి నామినేషన్ దాఖలు చేస్తారు. గత 3 నెలలుగా సిద్ధం , మేమంతా సిద్ధం సభలు, బస్సు యాత్రలతో ప్రజల్లోనే ఉన్నారు . మేమంతా సిద్ధం బస్సు యాత్ర చివరి రోజున వైస్సార్సీపీ తమ మ్యానిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం . కొత్తగా ప్రచారం చేయాల్సిన అవసరం లేకపోయిన మరోసారి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైయస్ఆర్సీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించడానికి ప్రచార ఏర్పాట్లు మమ్మురం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తరువాత ప్రతీ రోజు నాలుగు సభల్లో జగన్ పాల్గొనేలా షెడ్యూల్ సిద్దం అవుతోంది. సమయం తక్కువగా ఉండటం తో హెలికాఫ్టర్ ద్వారా ప్రచారం వేగవంతం చేయాలని నిర్ణయించారు
2019 ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు 99 శాతం పూర్తి చేసుకొని 2024 ఎన్నికలలకు సీఎం జగన్ సిద్ధం అవుతున్నాడు. ఈ అయిదు సంవత్సరాల పాలనలో మీ ఇంటిలో మంచి జరిగి ఉంటేనే వోట్ వేయండి అని ధైర్యంగా అడుగుతున్నారు. చంద్రబాబు ప్రచార సభలో ఇలాంటి మాటలకూ తావు లేకుండా పోయింది.