ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేపట్టి ప్రజలతో మమేకం అవుతున్నారు. మిగిలిన పార్టీలతో పోలిస్తే ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్న సీఎం జగన్ తాజాగా ఓ ప్రమాదంలో గాయపడిన వారిపట్ల తక్షణమే స్పందించి మానవత్వం చూపించారు. వివరాల్లోకి వెళితే
మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా పశ్చిమగోదారి జిల్లా కైకరం వద్ద రోడ్డు ప్రమాద ఘటనలో గాయపడ్డ వారిపట్ల సీఎం తక్షణమే స్పందించి మానవత్వం చూపారు. సీఎం కాన్వాయ్ మరో పావుగంటలో వెళ్లబోతుందనగా ఒక పోలీస్ వాహనాన్ని బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు వెనకనుంచి ఢీకొట్టారు. కాన్వాయ్ ప్రయాణిస్తున్నప్పుడు రోడ్డు ప్రమాదం జరిగిన విషయాన్ని పోలీసు సిబ్బంది బస్సులో సీఎం పక్కనే ఉన్న భద్రతా సిబ్బందికి తెలియజేశారు.
పూళ్ల నుంచి కాన్వాయ్ బయల్దేరి ఘటనా స్థలానికి చేరుకోగానే సీఎం బస్సును ఆపాల్సిందిగా ఆదేశించారు. ప్రమాదాన్ని చూసిన తర్వాత బాధితులకు వెంటనే వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. తనతోపాటు బస్సులో ప్రయాణిస్తున్న దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, ఏలూరు లోక్ సభ అభ్యర్థి కారుమూరు సునీల్‌కుమార్ యాదవ్ ను అక్కడే దించి వైద్యానికి తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భద్రతా నియమాలను ఉల్లంఘించి, సీఎం కాన్వాయ్ లో ఉంచిన అంబులెన్స్ ద్వారా ఏలూరు ఆశ్రం ఆస్పత్రికి తరలించారు. సత్వర వైద్య సేవలు అందించడానికి వీలుగా ఆస్పత్రిలోని వైద్యలను, సిబ్బందిని అప్రమత్తంచేశారు. ప్రమాద ఘటనపై సీఎం జగన్ స్పందించిన తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తవమవుతుంది.
కాగా సీఎం జగన్ కి దక్కుతున్న ప్రజాదరణను ఓర్వలేక ఆయనపై రాయితో దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. కాగా ఈ దాడి వెనుక చంద్రబాబు హస్తం ఉందని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనకు కారణమైన వారిని గుర్తించేందుకు పోలీసులు విచారణను వేగవంతం చేశారు.