2019 ఎన్నికల అనంతరం భారతదేశ రాజకీయ చరిత్రలోనే మునిపెన్నడు లేని విధంగా రికార్డు స్థాయి సీట్లతో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేక ఆటంకాలను ఎదురుకొంది. సీఎం జగన్ మీద నమ్మకంతో ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కరోనా మహమ్మారి రూపంలో ఎదురు దెబ్బ తగిలింది. ఇది ప్రజల కంటే కూడా ప్రభుత్వానికి ఊహించని పరిణామమే… అయితే కరోనా మహమ్మారి లాంటి కష్ట కాలంలో ఎకానమీ నిలబెట్టింది సీఎం జగన్ పథకాలే అనడంలో ఎలాంటి సందేహం లేదు.
కేవలం సీఎం దూరదర్శన్ తో మాత్రమే మహిళలకు ఆర్థిక స్వావలంబన కలిగిస్తూ, వారి కాళ్లపై వారు నిలబడే విధంగా పథకాలు ద్వారా చేయూత అందించారు. కరోనా సమయంలో దేశమంతా అల్లకల్లోలం అవుతున్న పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం కూడా సందిగ్ధంలో పడిన పరిస్థితులలో వైయస్ జగన్ గారు దూరదృష్టి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎకానమీ నిలబెట్టింది. ఇంతకాలం కేవలం తాయిలాలు ఇచ్చి వాటి మీద ఆధారపడే విధంగా మాత్రమే ప్రజలను చూసిన పరిస్థితుల నుండి వైయస్ జగన్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల ద్వారా వారి ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకుని ఉన్నతంగా తీర్చిదిద్దుకునే అవకాశాలు కల్పించింది.
ఇది మాత్రమే కాకుండా 16 వేల పైచిలుక గ్రామ వార్డు సచివాలయాలు, విలేజ్ క్లినిక్లు, రైతు భరోసా కేంద్రాలు, నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మార్చడంతో పాటు డిజిటల్ విద్యను ప్రవేశపెట్టడమే కాకుండా.. నిలువ నీడలేని నిరుపేదలకి దాదాపుగా 31 లక్షల పైన ఇళ్ల స్థలాలు ఇవ్వటమే కాకుండా వాళ్ళకి ఇల్లు ప్రభుత్వంమే కట్టించటం లాంటి అనేక కార్యక్రమాల ద్వారా వారికి ఆస్తి భరోసాని కల్పిస్తూ కరోనా మహమ్మరి లాంటి కష్ట సమయంలో కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం కుంటు పడకుండా ప్రజలు జీవన ప్రమాణాలు స్థితిగతులు ఏమాత్రం పడిపోకుండా ఆదుకున్నది వైయస్ జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలే అని నిస్సందేహంగా చెప్పవచ్చు.