ఖాజానా ఖాళీ అయిపోయింది.. పింఛన్లు ఇవ్వడం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఇష్టం లేదు. వలంటీర్ల ద్వారా రాజకీయాలు చేయాలని చూశారు.. ఇలా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, కూటమి పార్టీల నేతలు కొద్దిరోజులుగా నోటికొచ్చింది మాట్లాడారు. వలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేయకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా బాబు అడ్డుకుని మహదానంద పడిపోయాడు. ఇక వృద్ధులు, దివ్యాంగులకు డబ్బు చేరదు.. వాళ్లంతా జగన్ను తిట్టుకుంటారు. ఎన్నికల్లో నేను గెలిచేస్తానని విర్రవీగాడు.
అయితే జగన్ ప్రజలకు మంచి చేయడానికి ఎందాకైనా వెళ్తానని మరోసారి నిరూపించారు. ఎల్లో గ్యాంగ్ ఎన్ని సమస్యలు సృష్టించినా కేవలం రెండు రోజుల వ్యవధిలోనే 61.37 లక్షల మందికి పింఛన్లు అందించారు. రూ.1,847.85 కోట్లు లబ్ధిదారులకు చేరింది. మూడో తేదీ ప్రారంభం కాగా శుక్రవారం సాయంత్రానికి పంపిణీ శాతం 93.42గా నమోదైంది. శనివారం కూడా సాయంత్రం ఏడు గంటలకు సొమ్ము అందజేస్తారు.
ఎన్నికల హడావుడిలో ఇది సాధ్యమైందంటే అందుకు కారణం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డే. సంక్షేమ పథకాలను ప్రజల ఇళ్ల ముంగిటకే అందించేందుకు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఆయన ప్రవేశపెట్టారు. నేడు సకాలంలో పింఛన్లు పంపిణీ చేయలిగారు. ప్రభుత్వ ఆదేశాలతో సచివాలయాల ఉద్యోగులు వృద్ధులు, అనారోగ్య సమస్యలతో బాధపడే వారి వద్దకే వెళ్లి డబ్బు చేతిలో పెట్టి అండగా నిలిచారు. ఒకప్పుడు సచివాయాలు ఎందుకని బాబు, పవన్ ఏడ్చారు. కానీ వారే లేకపోతే నేడు పింఛన్లు సకాలంలో అందేవి కాదు. జగన్కు దూరదృష్టి ఎక్కువ. ప్రజల విషయంలో ఆయన అనేక విధాలుగా ఆలోచించి అత్యుత్తమ సేవలందిస్తారనేందుకు ఇదే నిదర్శనం.