తనపై దాడి జరిగిన అనంతరం మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ఒకరోజు విరామం ప్రకటించిన సీఎం జగన్ గాయాన్ని సైతం లెక్క చేయకుండా బస్సు యాత్రను కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ 15 వ రోజు మేమంతా సిద్ధం బస్సుయాత్స కృష్ణా జిల్లాలో కొనసాగింది. ఈ సందర్భంగా గుడివాడలో జరిగిన బహిరంగసభలో ప్రజల నుద్ధేశించి ప్రసంగించిన సీఎం వైయస్ జగన్ ఏమన్నారంటే..
గుడివాడలో ఈ రోజు మహా సముద్రం కనిపిస్తోంది. ఇది ప్రజల సముద్రం. మే 13న జరగబోతున్న ఎన్నికల మహా సంగ్రామంలో మంచి వైపు నిలబడిన ప్రజల సముద్రం ఇది. ఈ సభకు వచ్చిన నా అక్క చెల్లమ్మలకు, అన్నదమ్ములకు, అవ్వాతాతలకు, ప్రతీ ఒక్కరికీ నిండు మనసుతో మీ కుటుంబ సభ్యుడుగా మీ బిడ్డ.. మీ జగన్… రెండు జోతులు జోడించి పేరు పేరునా కృతజ్జతలు తెలుపుకుంటున్నాడు. పేదల భవిష్యత్తు కోసం.. పథకాలన్నీ కాపాడుకోవడానికి, కొనసాగింపునకు, ఇంటింటి అభివృద్ధిని, పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆ పెత్తందారులతో యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? మే 13న జరబోయే ఎన్నికల్లో ఇప్పటి వరకు పేదల భవిష్యత్తు కోసం 130 బటన్లు నొక్కిన మన ప్రభుత్వానికి మద్దతుగా రెండు బటన్ లు ఫ్యాన్ గుర్తు పై నొక్కడానికి, వంద మందితో నొక్కించడానికి స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచారం చేయడానికి మీరంతా సిద్ధమేనా..
మీ జగన్ మీద చంద్రబాబు, దత్తపుత్రుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, బీజేపీ, కాంగ్రెస్.. ఇవన్నీ సరిపోవన్నట్లుగా కుటిల పద్మవ్యూహంలో ఒక్కటై మీ జగన్ మీద బాణాలు సంధిస్తున్నారు. మీకు మంచి చేసిన మీ బిడ్డ మీద. మీకు ఆ మంచికి మధ్య మీ సేవకుడుగా ఉన్న ఒక్క మీ బిడ్డ మీద ఇంతమంది దాడి చేస్తున్నారు. అయినా మీ బిడ్డ అదరడు, మీ బెడ్డ బెదరడు, కారణం ప్రజలనే శ్రీకృష్ణుడి అండ ఉన్న అర్జునుడు మీ బిడ్డ. అర్జునుడు మీద ఓ బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్రం గెలిచినట్లు కాదు. జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షుత్రంలో ఆ దుష్టచతుష్టయం, పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు. ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కుచెదరదు. మీరు ఈ స్థాయికి దిగజారారంటే దానికి అర్థం.. విజయానికి మనం చేరువగా ఉన్నామని, వారు దూరంగా ఉన్నారని అర్ధం. ఈ తాటాకు చప్పుళ్లకు మీ బిడ్డ అదరడు.. బెదరడు. మీకు సేవా చేయాలన్న సంకల్పం మరింత పెరుగుతుంది తప్ప తగ్గదు.
నా నుదిట మీద వారు చేసిన గాయం కన్ను మీద.. తల మీద తగలలేదంటే దాని అర్థం.. దేవుడు మీ బిడ్డ విషయంలో పెద్ద స్క్రిప్టు రాసాడాని అర్థం. నా నుదిట మీద వారు చేసిన గాయం బహుశా పదిరోజుల్లో తగ్గిపోతుంది ఏమో గాని, చంద్రబాబు ప్రజలకు చేసిన గాయాలు పేదలు ఎన్నడూ మరిచిపోయే పరిస్థితి ఉండదు. గాయపరచడం, మోసం చేయడం, కుట్రలు చేయడం చంద్రబాబు నైజం. ఇంటింటికి మంచి చేయడం మీ బిడ్డ నైజం.
పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తా ఉంటే కులాల సమతుల్యం దెబ్బతుంటుందని ఏకంగా కోర్టులకు వెళ్లి కేసులు వేసినది బాబు కాదా?.. తాను ముఖ్యమంత్రిగా ఉంటూ తానే బీసీలను, ఎస్సీలను అవహేళన చేసిన వ్యక్తి ఎవరు.. ఈ బాబే.. విడగొట్టిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దు అన్నది ఎవరు?.. ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా అన్నది ఎవరు? బాబే. ఆ హోదాను తాకట్టు పెట్టినది ఈ బాబే. చివరకు చంద్రబాబు ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత ఎన్టీఆర్ పిల్ల నిచ్చి చేరదీస్తే చెప్పులు వేయించి వెన్నపోటు పొడిచినది చంద్రబాబు కాదా.. మల్లీ అవసరమైతే రామారావు గారి పొటో బయటకు తీసి ఆ ఫొటోకు దండలు వేస్తాడు.. ఇంత నీచమైన వ్యక్తి .. ఈ బాబే. పేదలకు ఏ మంచి చేయవద్దన్నది మాత్రమే చంద్రబాబుకు తెలుసు. ఈ మనిషికి మానవత్వం.. మంచితనం లేదు. దొంగ వాగ్ధానాలు, మోసం చేయడం, కుట్రలు చేయడం, దోచుకోవడం, దోచుకున్నది.. పంచుకోవడం…. ఇదే చంద్రబాబుకు తెలిసిన నీతి.
బాబును నమ్మడం అంటే చెరువులో చేపలకు కొంగను కాపాలా పెట్డడమే.. దొంగ చేతికి తాళాలు ఇవ్వడమే.. పులి నోట్లో తల పెట్టడమే.. గతంలో ఎన్నడూ జరగనట్లుగా, రాష్ట్రంలో ఏగ్రామాన్ని తీసుకున్నా ఏకంగా ఏడు వ్యవస్థలు కనిపిస్తున్నాయి. గ్రామ వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ అర్బన్ హెల్త్ క్లీనిక్కులు, మహిళా పోలీసులు, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు ప్రతీ గ్రామంలోనూ మీ బిడ్డ మార్కు కనిపిస్తోంది. మరి చంద్రబాబు మార్కు ఏమిటి.. జన్మభూమి కమిటీలు.పచ్చ పాముల అవినీతి కాట్లు, లంచాల గాట్లు.. దేశచరిత్రలో రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా అవ్వాతాతలకు రూ. 3 పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఎక్కడైనా ఉందా.. ఇంటి వద్దకే రేషన్.. ఇంటి సమీపంలోనే జనన, కుల ధృవీకరణ పత్రాలతో సహా.. 600 రకాల సేవలు అందిస్తున్నాం. మన గ్రామంలోని ప్రతీ 60-70 ఇళ్లకు వాలంటీర్ వ్యవస్థ మన కళ్ల ముందే కనిపిస్తోంది. ఇంతటి వ్యవస్థలను గతంలో ఎన్నడైనా చూసారా?. కేవలం ఈ 58ల నెలల్లోనే మీ బిడ్డ పాలనలోనే ఈ మార్పులు మన గ్రామంలో కనిపిస్తున్నాయి. మరి చంద్రబాబు ఏం చేసాడు.. చంద్రబాబు చేసిందేంటంటే జన్మభూమి కమిటీలను ముందర పెట్టి గ్రామాన్ని, రాష్ట్రాన్ని దోచేసాడు. మీ బిడ్డ ఆ దోపిడీని అరికట్టి ఇంటింటికి మంచి చేసాడు. రైతన్నకు చెప్పినది ప్రతీ ఒక్కటీ చేసాను. రైతన్నలకు తొలిసారిగా పెట్టుబడిగా తోడుగా రైతు భరోసా ఇస్తున్నదీ.. మీ బిడ్డ పాలనలోనే.. పగటి పూట ఉచిత విద్యుత్, ఇన్ పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ రుణాలు, ఉచిత భీమా, ఆక్వా రైతులకు రూ.1.50కే విద్యుత్, అమూల్‌తో సహకార రంగం పటిష్టం చేసినది ఎవరంటే మీ బిడ్డ, మీ జగన్.
14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు రైతుకు మంచి చేయకపోయినా సరే చెడు చేసిన బాబుకు ఎల్లో మీడియాకు 58 నెలల్లో చేసిన పథకాలు చూస్తే కడుపు రగిలిపోకుండా ఉంటుందా.. విద్యా రంగంలో గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థులను, తల్లితండ్రులను ప్రొత్సహించాం. అమ్మఒడి, విద్యా కానుక, నాడు – నేడు, గోరు ముద్దు, డిజిటల్ బోధనలు, ట్యాబులు, పెద్ద చదవులకు ఏ తల్లీ, తండ్రీ ఇబ్బంది పడకూడదని ఫీజు రియింబర్స్ చేస్తున్నాం. విద్యాదీవెన, వసతి దీవెన,పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు ప్రపంచ ప్రఖ్యాత విశ్వ విద్యాలయాల్లో ఇక్కడ నుంచే చదువుకునేలా సరికొత్త విప్లవాత్మక మార్పులు చేసినదీ..ఆన్లైన్ మీ బిడ్డ పాలనలోనే.. మన వైఎస్సార్ సీపీ పాలనలోనే జరిగింది.
మరి ఇన్ని చదువుల విప్లవాలు కళ్లెదుటే కనిపిస్తే చంద్రబాబుకు కడుపు మండదా… ఇంకో పక్క చంద్రబాబు మార్కు చదువుల విప్లవం అంటే నారాయణ, చైతన్య కోసం బలి పెట్టిన చదువులు గుర్తుకు వస్తాయి. ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లీషు మీడియం వద్దన్న ఆయన మాటలు గుర్తుకు వస్తాయి. వైద్య రంగంలో కూడా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఆరోగ్య శ్రీని వేయి నుంచి మూడు వేల ప్రొసీజర్లకు విస్తరించడంతో పాటుగా రూ. 25 లక్షల ఉచిత వైద్యం అందిస్తున్నది మీ బిడ్డ పాలనలోనే… మీ జగన్ పాలనలోనే.. ఆరోగ్య ఆసరా తో ఉపాధి భృతిని కూడా మీ బిడ్డ పాలనలోనే అందిస్తు్న్నాం. మొట్టమొదటి సారిగా గ్రామాలు మారాయి. గ్రామాల్లో విలేజ్ క్లీనిక్, ఫ్యామిలీ డాక్టర్, అరోగ్య సురక్ష, నాడు – నేడుతో ఆసుపత్రుల రూపు రేఖలు మారాయి. ఏకంగా 54 వేల కొత్త నియామకాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేసాం. మరో 17 మెడికల్ కాలేజీలు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి.. ఇవన్నీ జరిగింది.. ఎప్పుడు.. చేసినది ఎవరు. మీ బిడ్డ పాలనలోనే. మరి చంద్రబాబు కడుపు మండదా, వైద్యారోగ్య రంగంలో బాబు మార్కు ఎక్కడుంది.
డీసెంట్రలైజేషన్ కోసం 13 జిల్లాలను 26 జిల్లాలను చేసాం.4 సీ పోర్టులు తీసుకువచ్చాం. 10 కొత్త ఫిషింగ్ హార్బర్లు, 10 ఫిష్ ల్యాండ్ సెంటర్లు అంటే మీ జగన్. ఎయిర్ పోర్టుల విస్తరణ, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వాయువేగంతో పనులు జరుగుతున్నాయంటే కూడా మీ జగన్. మూడు ఇండిస్ట్రియల్ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నోడ్స్ వస్తున్నాయంటే మీ జగన్. ప్రణాళిక ప్రకారం ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టినది మీ జగన్. అందులో ఒకటి మచిలీపట్నం సీపోర్టు వేగంగా అడుగులు పడుతున్నాయి అంటే మీ జగనే. మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా …. గతంలో మేనిఫెస్టో అంటే రంగురంగులు కాగితాలు ఇచ్చేవాళ్ళు. ఎన్నికల అప్పుడు రంగురంగుల హామీలు ఇచ్చేవాళ్ళు. టీవీల్లో ఊదర కొడుతూ అడ్వర్టైజ్మెంట్లు వచ్చేవి. ఎన్నికల అయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టలోకి పోయేది. పేదలందరూ కూడా మోసపోయి అన్యాయం పాలు అవుతున్న చరిత్రను ఒక్కసారి తిరగరాస్తూ మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత 58 నెలల్లో మొదటిసారిగా మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత గా, బైబిల్ గా, ఖురానుగా దానికి నిర్వచనం ఇస్తూ ఏకంగా 99 శాతం మేనిఫెస్టోలో చెప్పిన హామీలను నెరవేర్చి, ఈరోజు ప్రతి ఇంటికి మంచి చేసి, మీ ఇంట్లో మీకు మీ బిడ్డ వల్ల మంచి జరిగి ఉంటే, మీ బిడ్డకు మీరే సైనికులుగా కదలిరండి అని చెప్పి.. మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న మీ బిడ్డ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి, నిజాయితీగా ఈ వ్యవస్ధలోకి మార్పు తీసుకుని వచ్చి చెప్పగలుగుతున్నాడు.
ఫ్యాన్ కు రెండు ఓట్లు వేస్తేనే ఇంటింటి అభివృద్ధి కొనసాగుతుంది అని స్టార్ క్యాంపైనర్లుగా ప్రతి ఒక్కరికి చెప్పమని కోరుతున్నాను. గతంలో 2014లో చంద్రబాబు గారు ఇదే కూటమిగా ఏర్పడ్డారు. ఆయన సంతకంతో ఇదే మాదిరిగా 2014లో ముఖ్యమైన హామీలంటూ.. చంద్రబాబు, దత్త పుత్రుడు, పక్కనే మోడీ గారి ఫోటో తో తయారుచేసి మేనిఫెస్టో కాపీని సంతకం పెట్టు మరి చంద్రబాబు ఇంటింటికి పంపించాడు. ఈనాడులోనూ, ఆంధ్రజ్యోతిలోనూ, టీవీల్లోనూ పేపర్లలోనూ అడ్వర్టైజ్మెంట్లను అదరగొట్టారు.
ముఖ్యమైన హామీలు అంటూ మీ ప్రతీ ఇంటికీ పంపించిన ఈ పాంప్లెట్ లో ఏముంది అంటే…రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు. రూ.87,612 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయా? చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోలో రెండో ముఖ్యమైన హామీ పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తా అన్నాడు. మరి రూ. 14, 205 కోట్ల రూపాయలో ఒక్క రూపాయి అయినా మాఫీ జరిగిందా? మూడో హామీ ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25,000 బ్యాంకులో డిపాజిట్ చేస్తాను అన్నాడు. ఆడబిడ్డ పుడితే మీ బ్యాంక్ అకౌంట్ లలో రూ.25000 డిపాజిట్ చేస్తా అన్నాడు. ఒక్క రూపాయి అయినా చేశాడా? చంద్రబాబు ఇచ్చిన మరో ముఖ్యమైన హామీ ఇంటింటికి ఉద్యోగం.. ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెలా రూ.2000 నిరుద్యోగ భృతి ఇస్తాను అన్నాడు. ఐదేళ్లలో అంటే 60 నెలల్లో నెలకు రూ. 2000 చొప్పున ఒక్కో ఇంటికి రూ. 1,20,000 ఇచ్చాడా? కట్టుకునేందుకు పక్కా ఇల్లు కనీసం మీలో ఏ ఒక్కరికైనా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా..? పదివేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అన్నాడు, చేనేత, పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. చేశాడా?. ఇందులో ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా చంద్రబాబు పూర్తి చేశాడా? ఉమెన్ ప్రొటక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేేశాడా? సింగపూర్‌కి మించి అభివృద్ధి చేస్తామన్నాడు, చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు, మీ గుడివాడలో కనిపిస్తుందా? ఇందులో ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా చేశారా అని అడుగుతున్నాను.
వాలంటీర్లు మళ్ళా ఇంటికే రావాలన్నా,పేదవాడి భవిష్యత్తు మారాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా…లంచాలు వివక్షాలేని పాలన జరగాలన్నా.. మన పిల్లలు మన బడులు బాగుపడాలన్నా. మన వ్యవసాయం మన హాస్పిటల్ లు మెరుగుపడాలన్నా… ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కి 175 కు 175 అసెంబ్లీ స్థానాలు.. 25 కు 25 ఎంపీ స్థానాలు.. ఒక్కటి కూడా తగ్గేందుకే వీల్లేదు.. సిద్ధమేనా? మన గుర్తు ఫ్యాను. అక్కడో.. ఇక్కడో.. ఎక్కడైనా మన గుర్తు తెలియకపోయినా, మర్చిపోయినా.. మన గుర్తు ఫ్యాన్ అని గుర్తుంచుకొండి. మంచి చేసిన ఫ్యాన్ ఎప్పుడూ కూడా ఇంట్లోనే ఉండాలి.. సైకిల్ ఎప్పుడూ ఇంటి బయటే ఉండాలి… తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడు కూడా సింక్ లోనే ఉండాలని చెబుతూ.. సీఎం వైయస్ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.