రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా సీఎం జగన్ చేపట్టిన “మేమంతా సిద్ధం” బస్సు యాత్ర నేటి సాయంత్రం టెక్కలిలో జరిగిన బహిరంగ సభతో ముగిసింది. మార్చ్ 27న ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ గారికి నివాళి అర్పించిన తరువాత ప్రొద్దుటూరు నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర దాదాపుగా 22 రోజుల పాటు సాగింది.
జగన్ చేపట్టిన ఈ బస్సు యాత్ర వైసీపీ శ్రేణుల్లో సరికొత్త జోష్ ని నింపితే ప్రత్యర్ధుల్లో మాత్రం గుబులు లేపింది. జగన్ వెంట పెద్ద ఎత్తున జనం కదలడం చూసిన ప్రతిపక్ష పార్టీల శిబిరాల్లో కలవరం మొదలైనట్టు తొలి రోజు నుండే స్పష్టంగా కనిపించింది. జగన్ వెళ్ళే ప్రతీ దారిలో టీడీపీ , జనసేన నుండి నాయకులు పెద్ద ఎత్తున వైసీపీ కండువా కప్పుకోవడంతో దాదాపుగా ఆయా నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీలు తమ పట్టుని కోల్పోయాయనే చెప్పాలి.
తుఫాన్ ని తలిపించే విధంగా సాగిన బస్సు యాత్ర టెక్కలిలో నేడు ముగిసింది. సీఎం జగన్ నేటి రాత్రికి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారని అనంతరం రేపటి రోజున పులివెందులకు వెళ్లి ఎమ్మెల్యే అభ్యర్ధిగా తన నామినేషన్ ను దాఖలు చేయబోతునట్టు తెలుస్తుంది.. ఇక ఈ నెల 26న తమ పార్టీ మేనిఫెస్టోను జగన్ విడుదల చేయనున్నారని ఇప్పటికే వార్తలు వస్తున్న నేపథ్యంలో చెప్పిన హామీ చెప్పినట్టు చేసిన జగన్ సదరు మ్యానిఫెస్టోలో ఎలాంటీ హామీలు ఇవ్వబోతున్నారో అని రాజకీయ వర్గాలో ప్రజల్లో ఉత్కంఠ మరింత పెరిగింది.