ఉమ్మడి కృష్ణా జిల్లా ఒక్కప్పుడు టీడీపీ కి కంచుకోట అలాంటి చోటా ఈరోజు చతికిలపడింది. 2019 లో 16 సీట్లకు గాను 14 చోట్ల ఓడిపోయి, విజయవాడ మేయర్ తో పాటు జెడ్పీ చైర్మన్ ఇలా ప్రతి ఎన్నికల్లో ఓడిపోయి అప్రతిష్ట పాలయింది. ఇప్పుడు 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కూటమిగా ఏర్పడి ఎలక్షన్స్ పోటీకి సిద్ధం అయ్యారు. జిల్లా పరిస్థితులు చూస్తుంటే రోజూ రోజుకి కూటమి పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతుంది.
తిరువూరులో అమరావతి ఉద్యమ నాయకుడు అని కొలికపూడిని తీసుకువచ్చి ఇక్కడ అభ్యర్ధిగా ప్రకటించారు. అతని మాటల కారణంగా సొంత సామాజిక వర్గం నేతలే దూరంగా వున్నారు. గతంలో కొలికపూడి వంగవీటి రంగా మీద మాట్లాడిన మాటల కారణంగా కాపులు కోపంతో వున్నారు. ప్రచారానికి వెళితే మహిళలు కొలికపూడిని గ్రామాల్లోకి ప్రచారానికి రానివ్వడం లేదు. దీంతో ఇప్పుడు తిరువూరులో అభ్యర్థిని మార్చే పనిలో పడింది టీడీపీ.
జగ్గయ్యపేట లో శ్రీరామ్ తాతయ్యకు నెట్టెం రఘురాం, ఛానెల్ అధిపతి కి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గు మనేలా గొడవలున్నాయి. కమ్మ సామాజికవర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఈసారి శ్రీరామ్ తాతయ్య కు సపోర్ట్ చెయ్యమని తెగిసి చెబుతున్నారు.
మైలవరంలో చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు కృష్ణా జిల్లాను ఏలిన దేనినేని ఉమకు టికెట్ దక్కలేదు. దీనితో ఆయన వర్గం , బొమ్మసాని వర్గం వసంతకుమార్ కు సపోర్ట్ చెయ్యకుండా ఎక్కడిక్కడ గొడవలు చేస్తున్నారు.
నూజివీడులో టీడీపీలో కీలక నేతలయిన మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య, ముదరబోయిన వెంకటేశ్వరరావు ఇప్పటికే టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో జాయిన్ అయ్యారు. ప్యారాచూట్ నేత అయిన పార్థసారథికి కార్యకర్తల నుంచి ఆశించినంత సపోర్ట్ అందడం లేదు. దీనితో ఇక్కడ వైసీపీకి గెలుపు నల్లేరు మీద నడకలా వుంది.
నందిగామలో తంగిరాల సౌమ్య ఒంటెద్దు పోకడలతో ద్వితీయ శ్రేణి నాయకులు విసుగు చెంది, ఆమెకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో ఎక్కడ పాల్గొనడం లేదు . కార్యకర్తలకు గ్రామాల్లో దిశా నిర్దేశం చేసే నాయకులు కరువయ్యారు.
విజయవాడ పశ్చిమలో కూటమిలో జరగాల్సిన రచ్చ జరుగుతూనే వుంది. ఇక్కడ నలుగురైదుగురు నేతలు టికెట్ కోసం పోటి పడ్డారు చివరకు జనసేన తరుపున పొతిన మహేష్ పోటి అని ప్రకటించినా ఆఖరికి బిజెపి టికెట్ సంపాదించి చంద్రబాబు ఆత్మీయుడు అయిన సుజనా చౌదరి పోటి చేస్తున్నరు. సుజనా చౌదరి అభ్యర్ధి అన్న ప్రకటనతో ముస్లిం మైనార్టీ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
విజయవాడ సెంట్రల్ నుండి బోండా ఉమకు టికెట్ దక్కింది. అయితే వంగవీటి రాధా కు బోండా ఉమ వర్గాల మధ్య గొడవలు తీవ్ర స్థాయికి వెళ్ళాయి. వాట్సాప్ గ్రూప్ ల్లో ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. చివరకు చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకొని ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చిన ఒకరికి ఒకరు సహకరించే పరిస్థుతులు లేవు.
విజయవాడ తూర్పు నుండి ప్రస్తుత ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కు మళ్ళీ టికెట్ కేటాయించారు. ఇక్కడ 2019 లో గెలిచిన తరువాత గద్దె రామ్మోహన్ ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో పాటు ముస్లిం సామాజిక వర్గానికి షాది ఖనా విషయంలో మోసం చేశారనే విషయంలో వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. జనసేన తరుపున 2019లో 30వేల ఓట్లు సంపాదించిన బత్తిన రాముతో వచ్చిన గొడవతో అతను వైసీపీలో జాయిన్ అయ్యారు .
పెనమలూరు టికెట్ విషయంలో రచ్చ రచ్చ జరిగింది . బొడే ప్రసాద్ కు టికెట్ నిరాకరించడంతో నియోజకవర్గం అంతా గొడవలు జరగడంతో తిరిగి బోడే ప్రసాద్ కు టికెట్ కేటాయించారు. దీనితో దేవినేని చందు తనను చంద్రబాబు నాయుడు మోసం చేశారని, స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతా అని ప్రకటించారు.
గన్నవరం లో యార్లగడ్డ వెంకట్రావుకు టికెట్ కేటాయించారు. యార్లగడ్డ అగ్రెసివ్ రాజకీయాలతో పాత తరం నాయకులను కలుపుకుని పోవడం లేదు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈసారి యాదవ్ లకు అవకాశం ఇస్తా అని మోసం చెయ్యడంతో ఇప్పుడు ఆ వర్గాలు టీడీపీ కు దూరంగా వున్నారు.
పెడన నియోజకవర్గంలో టీడీపీ టికెట్ దక్కించుకోవడంతో జనసేన నాయకులు ముఖ్యంగా కార్యకర్తలు సహకరించే పరిస్థుతులు లేక ప్రతి గ్రామంలో రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరికి ఒకరు సహకరించే పరిస్థుతులు లేకుండా వుంది.
గుడివాడ లో వందల కోట్లు ఖర్చు పెట్టే ఎన్నారైకి టీడీపీ టికెట్ ఇవ్వడంతో పిన్నమనేని వర్గం, రావి వెంకటేశ్వరరావు వర్గం ఆసలు సపోర్ట్ చేసే అవకాశం లేదు. కేవలం డబ్బు సంచులతో వచ్చాడు అని వెలిగండ్ల రాము కు టికెట్ కేటాయించాడంతో టీడీపీ అభ్యర్థికికి మద్దతు దక్కడం లేదు.
మచిలీపట్నం లో రవీంద్ర కు టికెట్ కేటాయించారు. జనసేన కూడా సపోర్ట్ చేస్తుంది కానీ ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ అడ్డుకోవడం, వైసీపీ నాయకులను చంపించడంతో పాటు గతంలో మంత్రిగా కొల్లు రవీంద్ర మచిలీపట్నంకు చేసింది ఏమి లేదని ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వుంది. అదే టైంలో పేర్ని నాని ఆధ్వర్యంలో మెడికల్ కాలేజ్ రావడం, పోర్టు నిర్మాణం పనులు పూర్తి స్థాయిలో జరుగుతున్నడంతో ప్రజలు వైసీపీ కి అనుకూలంగా వున్నారు.
కైకలూరు లో బిజెపి కు టికెట్ కేటాయించాడంతో జనసేన నాయకులు మేము బీజేపీ జెండా మోయడానికి సిద్ధంగా లేము మేము కూడా పోటి చేస్తామమని, ఏప్రిల్ 19నా నామినేషన్ వేస్తామని ప్రకటించారు.
అవనిగడ్డ లో తాజాగా టీడీపీ అభ్యర్ధి అయిన మండలి బుద్ధప్రసాద్ జనసేనలోకి జాయిన్ అయ్యి టికెట్ సంపాదించడంతో జన సేన నాయకులు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ మమ్మల్నీ దారుణంగా మోసం చేశాడని మమ్మల్ని నీచంగా చూసిన మండలి బుద్ధప్రసాద్ కు టికెట్ ఎలా కేటాయిస్తారు అంటూ భారీ ర్యాలీ నిర్వహించి మండలి బుద్ధప్రసాద్ ను ఓడించి తీరుతాం అని ప్రతిజ్ఞ చేశారు.
పామర్రు లో టిడిపి అభ్యర్థికి ప్రజల నుండి ఆశించినంతగా స్పందన రాకపోవడం తో దిక్కు తోచక వున్నారు. ఇక్కడ జనసేన నాయకులు పామర్రులో టీడీపీ కి మద్దతు ఇవ్వకపోవడం తో ప్రచారంలో వెనకబడి వున్నారు.
ప్రస్తుత పరిస్థుతులు చూస్తుంటే 2019 లో గెలిచిన రెండు సీట్లు కూడా మళ్ళీ గెలుచుకొనే పరిస్థితి కనపడటం లేదు ఇంకా ఎన్నికలకు 40 రోజులు వున్నాయి. ఈలోపు గొడవలు సర్దిచెప్పకపోతే టీడీపీ కి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఊహించని విధంగా రిజల్ట్స్ ఉండబోతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.