మెగా బ్రదర్స్ ఎంతటి అవకాశవాదులో మరోసారి బయటపడింది. వారంతా తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి కోసమే పనిచేస్తున్నారని స్పష్టమైంది. బాబు పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో తప్పేమీ లేదు. కానీ వాడిన పదాలే మెగా అభిమానులకు కోపం తెప్పిస్తున్నాయి.
‘అహర్నిశలు ప్రజల మధ్య ఉంటూ, ప్రజా సంక్షేమం కోసం పాటుపడే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ ఇది చిరంజీవి చేసిన ట్వీట్. చరిత్ర చూస్తే పీఆర్పీ సమయంలో చిరు బాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సందర్భాలున్నాయి. ఆయనంత అవకాశవాదని లేడని తిట్టిపోసిన సందర్భాలు అనేకం. ప్రజారాజ్యం మూతపడేందుకు కారణం బాబే, ఎల్లో మీడియా ఇది జగమెరిగిన సత్యం. చిరు పార్టీ వల్ల 2009లో తమకు అధికారం దూరమైందని ఇప్పటికీ తెలుగు తమ్ముళ్లు తిడుతుంటారు.
కట్ చేస్తే.. ఇప్పుడు నారా వారికి మెగా బ్రదర్స్ అత్యంత ఆప్తులయ్యారు. చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు పూర్తి మద్దతు ఇస్తున్నాడు. ఇది ప్రస్తుతం తెలుగుదేశం నీడలో ఉంది. తమ్ముడికి బాబు అత్యంత కావాల్సిన వ్యక్తి కాబట్టి చిరుకి కూడా సన్నిహితుడైపోయాడు. రాజకీయాల్లో ప్రజా ద్రోహిగా కనిపించిన చంద్రబాబు నేడు ప్రజా సంక్షేమం కోసం పాటుపడే వ్యక్తిగా ఎలా మారిపోయాడో మెగా బ్రదర్ చెప్పాలి. పిలిచి మర్యాద చేసి సమస్యలు పరిష్కరించిన జగన్‌పై హత్యాయత్నం జరిగితే కనీసం మానవత్వం కూడా చూపలేదు. ఖండిస్తూ ప్రకటన చూడా ఇవ్వలేదు. తన సోదరుడి దత్తతండ్రి బర్త్‌డే అనగానే ట్వీట్ చేసి అసలు రూపాన్ని బయటపెట్టుకున్నాడు.
తమ అవసరాల కోసం ఎంతకైనా దిగజారే మనస్తత్వం మెగా సోదరులదని అటు సినిమా పరిశ్రమలో, ఇటు రాజకీయాల్లో పేరుంది. ఇదే చిరంజీవి సినిమా టికెట్ల రేట్ల పెంపు కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని పలుమార్లు కలిశాడు. అప్పుడు నమస్కారం పెడితే పవన్ గగ్గోలు పెట్టాడు. నిన్ను అడుక్కోవాలా జగన్ అంటూ సభల్లో అరిచాడు. ఇప్పుడు చిరంజీవి చంద్రబాబును కీర్తిస్తూ ట్వీట్ చేస్తూ చేశాడు. మరి దీనిని ఏ కోణంలో చూడాలో మెగా లాస్ట్ బ్రదర్ చెప్పాలి. టీడీపీ అధికారంలోకి వస్తే తాము బాగా లబ్ధి పొందవచ్చని ఈ సోదరులు కలలు కంటున్నారు. కానీ బాబు అదే ఆ పప్పులేవీ ఉడకవు. కాపుల ఓట్లు కావాలి కాబట్టి తగ్గి ఉన్నాడు. పని అయిపోయాక మీతో నాకు పనేం లేదని ముఖం పక్కకు తిప్పుకొంటాడు. మెగా బ్రదర్స్‌కు ఇలాంటి వారే కరెక్ట్.
– వీకే..