చంద్ర బాబు నాయుడును నమ్మి బీసీ, ఎస్సీ , ఎస్టీ , మైనారిటీ నాయకులు టీడీపీలో చేరితే చివరకి నట్టేట ముంచుతాడు అని మరొక సారి చూపించాడు. చంద్రబాబు నాయుడు ను నమ్మి 2014 నుండి 23 వరకు ప్రత్యర్థి పార్టీల నుండి టీడీపీ లోకి పార్టీ మారిన బీసీ, ఎస్సీ , ఎస్టీ , మైనారిటీ నాయకులకు పదవులు ఇస్తాము అని చెప్పి కండువాలు కప్పి చివరకు టీడీపీ పార్టీలోనే కాదు రాజకీయ ఉనికే లేకుండా చేసాడు.
2014 నుండి టీడీపీ ప్రధాన ప్రత్యర్ధి పార్టీ అయిన వైఎస్సార్సీపీ నుండి జాయిన్ అయిన బీసీ, ఎస్సీ , ఎస్టీ , మైనారిటీ ఎమ్మెల్యేలు అయిన రంప చోడవరం నుంచి పంతల రాజేశ్వరికి టికెట్ ఇవ్వలేదు , విజయవాడ పశ్చిమ నుండి జలీల్ ఖాన్ కు టికెట్ ఇవ్వలేదు సరికదా కనీసం తనను కలిచే అవకాశం కూడా ఇవ్వడం లేదు బాబు,
యర్రగొండ పాలెం నుండి వైఎస్సార్సీపీ నుండి గెలిచి టీడీపీ లోకి వెళ్లిన డేవిడ్ రాజు అసలు ఇప్పుడు ఎక్కడ వున్నాడో ఎవరికి తెలియని పరిస్థితి.
విశాఖ పాడేరు నుండి గెలిచి వెళ్లిన గిడ్డి ఈశ్వరి తన ఉనికి నీ కోల్పోయ్యారు. తనకు టికెట్ దక్కక పోవడం తో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
శ్రీకాకుళం పాత పట్నం నుండి కలమట వెంకటరమణకి టికెట్ లేదు అని గోవింద్ రావు కి ఇవ్వడం జరిగింది.
కదిరి నుండి గెలిచి పార్టీ మారిన అత్తర్ చాంద్ బాషాకు టికెట్ లేదు పార్టీలో గుర్తింపు లేదు సరికదా కనీసం పలకరించే వారు కూడా లేరు
కోడుమూరులో పార్టీ మారిన గాంధీ కి టికెట్ లేదు అసలు ఇప్పుడు ఏమీ చేస్తున్నారో ఎవరికి తెలియదు. తన రాజకీయ జీవితంకు చరమ గీతం పాడారు.
బద్వేల్ లో పార్టీ మారిన జయరాములు కు బాబు మార్క్ వెన్నుపోటు చూపించి అసలు రాజకీయాల్లో అనామకుడిగా మార్చారు.
ఇక తాజాగా పార్టీ మారిన ఉండవల్లి శ్రీదేవికి చంద్ర బాబు నాయుడు తాడికొండ లేదా బాపట్ల ఎంపీ టికెట్ అని ఆశ చూపి చివరకు వెన్నుపోటు పొడిచారు అని ఘోల్లుమని తన అవేదనను ఎక్స్ లో ప్రకటించింది.
గుమ్మనురి జయరాంకి బీసీ నాయకుడిగా గుత్తిలో అవకాశము ఇస్తా అని టీడీపీ లోకి జాయిన్ చేసుకొని ఈరోజు తన సీటు కోసం చంద్ర బాబు కాళ్ళ మీద పడినా ఇంకా తన పేరు ప్రకటించలేదు..
అదే టైంలో టీడీపీలో జాయిన్ అయిన అగ్రవర్ణ నాయకులకు గతంలో మంత్రి పదవులు ఇవ్వటమే కాకుండా మరల పోటి చేసే అవకాశం ఇచ్చిన బాబు , ఇప్పుడు పార్టీ మారిన అగ్రవర్ణ నాయకులకు ఎమ్మెల్యే గా పోటీ చేసే అవకాశం ఇచ్చారు కానీ, బీసీ, ఎస్సీ , ఎస్టీ , మైనారిటీ నాయకులకు మాత్రం చంద్రబాబు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు, పార్టీ పదవులు ఇవ్వలేదు చివరకు తనని కలిసే అవకాశమే ఇవ్వడం లేదు.