ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడించేందుకు ఆయన కొడుకులనే వాడుకోని ఆ తరువాత వారిని కూడా ముంచాడు అన్నది జగద్విదితమే . ఆ పార్టీని వారసత్వాన్ని వారి నుండి లాక్కోని చేతిలో చిన్న బెల్లం ముక్కలు పెడుతూ పక్కన కూర్చోబెట్టాడు అనటానికి ఓ ఉదాహరణ మరుగున పడిన ఈ వార్త.
ఎన్టీఆర్ గారి కొడుకు రామకృష్ణ తన రామకృష్ణా స్టూడియోలో సౌండ్ రికార్డింగ్ యంత్రాల కొనుగోలుకు 50 లక్షలు సహాయం కోసం 1989 లో చేసుకున్న దరఖాస్తుపై ఆనాడు ఎన్టీఆర్ ఏ నిర్ణయం తీసుకోలేదు. తర్వాత 94 లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ అంశాన్ని పట్టించుకోలేదు. కానీ మామని వెన్నుపోటు పొడిచేందుకు సహకరించిన ఈ బావమరిది పాత అభ్యర్ధన పై 1996 లో చంద్రబాబు ప్రభుత్వం స్పందిస్తూ నిధులు మంజూరు చేసింది. అంతకన్నా ముందు అప్లై చేసిన పది మంది ఫైల్లు మాత్రం బూజు పట్టిపోయాయి .
రామకృష్ణకే కాదు బాలకృష్ణకి కూడా పలు తాయాలాలు పంపిణీ చేస్తూనే ఉన్నాడు చంద్రబాబు. రాజధాని ప్రకటించే ముందు అమరావతి చుట్టూ 500 ఎకరాల భూమిని బాలకృష్ణ కొన్నాడని ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ అని పలు పత్రికలు వెల్లడించాయి. ఇహ బాలకృష్ణ చిన్న అల్లుడికి చెందిన గీతం యూనివర్సిటీ వైజాక్ చేసిన భూ ఆక్రమాణలకు, దోపిడీకి అడ్డూ అదుపు లేదని చెప్పొచ్చు.
బాబు అధికారంలో ఉన్నన్ని రోజులు చంద్రన్న సంక్రాంతి కానుక అంటూ ప్రజలకు పాడైన పప్పు బెల్లాలు ఇచ్చేవాడు.. ఆలోచిస్తే ఎన్టీఆర్ గారి వారసులకు ఇచ్చిన తాయిలాల కంటే అవే బెటర్ అనిపిస్తుంది.