వెన్నుపోట్లే రాజకీయ మెట్లుగా మార్చుకుని ఎదిగిన చంద్రబాబుమరోసారి తన మార్క్ వెన్నుపోటుకు సిద్దమైనట్టు ఆ పార్టీ వారు పెడుతున్న ప్రెస్ మీట్లు చూస్తే అర్ధమవుతుంది. అయితే ఈ సారి ఆయన పొడవబోయే పోటు ఆ పార్టీ సీనియర్ బీసీ నేత అచ్చం నాయుడకే వాదన వినిపిస్తుంది. ఉత్తరాంధ్రలో రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న అచ్చం నాయుడు తెదేపా రాష్ట్ర అధ్యక్షులుగా భాధ్యతలు చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ భాధ్యతల నుండి ఆయనను తప్పించేలా పావులు కదుపుతునట్టు గత కొద్ది కాలంగా ప్రచారం జరుతూనే వస్తుంది.
ఇదిలా ఉంటే నేడు తెలుగుదేశం పార్టీ నేతల్లో ఒకరైన బుద్దా వెంకన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ అచ్చం నాయుడు పదవికి ఎసరు పెట్టేలా కీలక వాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ నారావారి రెక్కల కష్టం అని, కాబట్టి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి అచ్చం నాయుడుని తప్పించి వెంటనే ఆ పదవిని నారా లోకేష్ కి కట్టబెట్టాలని ఇది మా డిమాండ్ అని కావాలంటే అచ్చం నాయుడికి వేరే బాధ్యతలు అప్పజెప్పాలని, ఈ విషయంలో పార్టీ నేతలందరు చంద్రబాబుకు సపొర్ట్ చేస్తారని ప్రకటించారు.
నందమూరి తారక రామారావుగారి రెక్కల కష్టం మీద ఏర్పడ్డ తెలుగుదేశాన్ని కబ్జా చేసింది చంద్రబాబైతే, టీడీపీ పార్టీ బాబు రెక్కల కష్టం అని బుద్దా వెంకన్న అనడం వెనుక ఎవరు ఉన్నారో ఇట్టే చెప్పొచ్చు అని ఆపార్టీ నేతలే మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబుకి మొదటి నుండి తాను చేయాలనుకున్న పనికి ఇలా లీకులు వదిలి దానిపై చర్చ వచ్చేలా చేసి చివరికి తాను అనుకున్నది చేస్తాడని ఇది చంద్రబాబుకి మోదటి నుండి అలవాటేనని, ఈ క్రమంలోనే లోకేష్ కి రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలు కట్టబెట్టడానికి బీసీ నేతయిన అచ్చం నాయుడికి వెన్నుపోటు పోడిచే కార్యక్రమానికి తెరేలేపి బుద్దావెంకన్న చేత లీకులు ఇప్పిస్తున్నారని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఏది ఏమైనా ఈ వ్యవహారంతో చంద్రబాబు ఎప్పటి నుండో కోరుకుంటునట్టు టీడీపీ పార్టీని లోకేష్ చేతుల్లో పెట్టబోతున్నారని తేలిపొయింది.