తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇంటిపోరుతో సతమతమవుతున్నాడని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది రోజురోజుకు అధికమవుతోందని ప్రచారం జరుగుతోంది. బయటకు అంతా బాగున్నట్లు కనిపిస్తున్నా.. తండ్రీకొడుకుల మధ్య విభేదాలు నారా వారి కుటుంబం చీలిపోయిందని, నిత్యం గొడవలతో అట్టుడుకుతోందని తెలుగు తమ్ముళ్ల మధ్య చర్చ నడుస్తోంది.
ఆస్తి విషయంలో, అధికారం కోసం కుటుంబసభ్యులు తనను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని చంద్రబాబు ఇటీవల కలిసిన సీనియర్ నేతల వద్ద వాపోయారట. భువనేశ్వరి ఆడియో బయటకు రావడంతో ఆయన మనసు బాగా నొచ్చుకుందంట. ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు చూస్తే బాబుకు ఇంటిపోరు నిజమేని రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లాకే చాలా సంఘటనలు జరిగినట్లు చెబుతున్నారు.
లోకేశ్‌కు పాదయాత్ర చేయడం ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ తండ్రి ఒత్తిడి చేయడంతో ఒప్పుకొన్నాడు. అది మధ్యలో ఉండగానే నారా వారు అవినీతి కేసులో అరెస్ట్ అయ్యారు. ఈ సమయంలో పాదయాత్ర ఆపొద్దని, జనంలోనే ఉండాలని బాబు గట్టిగా చెప్పారని పార్టీ వర్గాల నుంచి తెలిసింది. కానీ చినబాబు వినకుండా దొరికిందే చాన్స్ అని ఢిల్లీలో మకాం పెట్టాడు. ఇది నచ్చని బాబు పవన్ కళ్యాణ్‌కు కబురు పంపాడు. అప్పటి వరకు లోపాయికారీగా ఉన్న పొత్తును అధికారికం చేద్దామని చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న లోకేశ్ వెంటనే జైలు వద్ద వాలిపోయాడట. జనసేనతో పొత్తు వద్దని, ఒంటరిగానే ఎన్నికలకు వెళ్దామని బాబుకు చెప్పించినా వినలేదని సమాచారం. జైల్లో ములాఖత్ సమయంలో తండ్రీకొడుకుల మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. ఆ సమయంలో భార్య భువనేశ్వరి, కోడలు బ్రహ్మణి లోకేశ్‌కు పూర్తి మద్దతు తెలిపారట.
అధికారం వచ్చాక తనకు పూర్తిగా పెత్తనం ఇస్తానంటేనే పొత్తుకు అంగీకరిస్తానని లోకేశ్ చెప్పడంతో చంద్రబాబు తలూపినట్లు తెలిసింది. కాగా జైలు నుంచి బయటకు వచ్చాక నారా వారు చినబాబుతో సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టాడట. జనసేనకు పదిలోపే సీట్లు ఇవ్వాలని, అది కూడా వాళ్లు అడిగిన చోట కాకుండా ఇచ్చిన చోట తీసుకునేలా చూడాలని లోకేశ్ చెప్పినా అధిష్టానం పట్టించుకోలేదని తెలిసింది. దీనికితోడు ఈయన చెప్పిన వారికి టికెట్లు దక్కలేదు. రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి ఒప్పుకోలేదు. మొత్తంగా చాలా విషయాల్లో తండ్రీకొడుకుల మధ్య విభేదాలు అధికమయ్యాయి. దీంతో బాబు తనయుడిని దూరం పెడుతూ వచ్చాడని సమాచారం. అందుకే ప్రధాని మోదీ సభలో వేదిక ఎక్కనివ్వలేదని చెబుతారు. ఇప్పటికీ పార్టీ చంద్రబాబు వర్గం, లోకేశ్ వర్గంగా విడిపోయింది.
ప్రస్తుతం చంద్రబాబు మాటలను ఇంట్లో వారు ఎవరూ వినడంలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కుప్పంలోనే ఉండిపోవాలని భువనేశ్వరికి చెబితే రెండు రోజులు తిరిగి హైదరాబాద్‌కు వెళ్లిపోయారట. బాలకృష్ణ కూడా తన సోదరి, కుమార్తె, అల్లుడికే సపోర్టుగా ఉన్నారని తెలిసింది. ఒకవేళ అధికారం వస్తే పవన్‌కు ప్రాధాన్యం ఇవ్వకుండా తనకు మాత్రమే అవకాశం ఇస్తానని మాట ఇస్తే సర్దుకుపోతానని, కాదంటే మాత్రం దూరంగానే ఉంటానని ఇప్పటికే లోకేశ్ పార్టీ పెద్దల ద్వారా చంద్రబాబుకు చెప్పించాడని అంటున్నారు. దీనికితోడు భువనేశ్వరి ఆడియో ఒకటి విడుదలైంది. అందులో తిట్టింది బాబునేనని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఏ రకంగా చూసినా బాబు పరిస్థితి దారుణంగా ఉంది. అధికారంలోకి వస్తే భార్య, కొడుకు, కోడలు లాక్కొని, అవినీతి చేసి సంపాదించిన సొమ్ము మొత్తం తీసేసుకుంటారనే భయంతో ఆయన పూర్తిగా పవన్‌పై ఆధారపడ్డారని ప్రచారం జరుగుతోంది. నాడు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచాడు. ఆ పాపం తగలకుండా పోతుందా.. ఈ జన్మలోనే కదా అనుభవించాలి.