టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు 2024 ఎలక్షన్స్ కోసం తన పార్టీ పోటి చేస్తున్న 17 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఈ 17 మంది అభ్యర్థుల్లో ఒక్క కాపు అభ్యర్థికి కూడా సీటు ఇవ్వలేదు. అలాగే బీసీలకు కూటమి తరుపున కేవలం 6 టికెట్ లు మాత్రమే ప్రకటించారు.
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రిజర్వ్ సీట్లు తీసేస్తే మొత్తం 11 చోట్ల బీసీలకు అవకాశం కల్పించారు, ముగ్గురు కాపులకు అవకాశం కల్పించారు. కానీ బీసీల టీడీపీ కి వెన్నుముక లాంటి వారు , కాపులకు మేమే రాజకీయ అవకాశాలు ఎక్కువగా ఇచ్చాము అంటూ దొరికిన ప్రతి సందర్భం లో, ప్రతి సభ లో ఉదరగొట్టే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు 2024 ఎలక్షన్ కు ప్రకటించినా టికెట్లలో కాపులకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు.
ఇక కూటమి గా బీసీ లకు కేవలము 6 సీట్లు మాత్రమే కేటాయించారు.
దీనితో కాపు వర్గాల్లో టీడీపీ మీద కోపంతో రగులుతున్నారు. చంద్రబాబు నాయుడు మమ్మల్ని మోసం చేశారు, గోదావరీ జిల్లాల్లో సగం వున్న మాకు కనీసం ఒక్క ఎంపీ టికెట్ కేటాయించలేదు మమ్మల్ని మరి చులకనగా చూస్తున్నారు అని తమ భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకున్నారు .
ఇక బీసీ లు మమ్మలని పార్టీ కి వెన్నుముక అంటూ మాటలు చెప్పి చివరకు ఎలక్షన్స్ వచ్చే సరికి మాత్రం చంద్రబాబు నాయుడి సొంత సామజిక వర్గానికి పల్లకి మొయ్యడానికి వాడుకుంటున్నారు, మాకు పోటి చేసే అవకాశం ఇవ్వడం లేదు అంటూ తమ గోడు ను వెళ్ళ దిసుకుంటున్నరు .
చంద్రబాబు నాయుడు కేవలం వందల కోట్లు ఖర్చు పెట్టుకొనే బడా పారిశ్రామిక వేత్తలకు అది సొంత వారికి మాత్రమే టీడీపీ తరుపున పోటీ చేసే అవకాశం ఇచ్చారు, బీసీ లకు, కాపులకు మొండి చెయ్యి చూపించారు అని కార్యకర్తలు ఎక్కడిక్కడ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ టికెట్ ల పంచాయితీ తో బాబుకు కాపులు , బీసీ సామజిక వర్గాలు క్రమక్రమంగా దూరం అవుతున్నయి. ఇప్పటికైనా చంద్ర బాబు నాయుడు జరుగుతున్నా పరిణామాలను చూసి టికెట్ ల మార్పు చేస్తారో లేక తన అలవాటు ప్రకారం పల్లకి మొయ్యదనికి మాత్రమే అని వదిలేస్తారో చుడాలి.