తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి కుప్పంలో ఓటమి భయంలో పట్టుకుంది. దీంతో ఆ నియోజకవర్గంలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నాడు. ఏపీలో ప్రభుత్వం ఆధ్వర్యంలో దుకాణాలు నడుస్తున్నాయి. ఇక్కడ లెక్కలు పక్కాగా ఉంటాయి. దీంతో బాబు తన పలుకుబడితో కర్ణాటక రాష్ట్రం నుంచి లో క్వాలిటీ మద్యం తక్కువ ధరకు విచ్చలవిడిగా దిగుమతి చేయించి కుప్పం తమ్ముళ్లను మత్తులో ఉంచుతున్నాడని విమర్శలున్నాయి.
మూడున్నర దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా బాబు ఈసారి కుప్పంపై స్పెషల్ ఫోకస్ పెట్టాడు. ఒకప్పుడు నేతలు ఆయన తరఫున నామినేషన్లు వేసేవారు. ఈసారి మాత్రం భార్య భువనేశ్వరిని పంపాడు. ఆమె అక్కడే మకాం పెటింది. బాబు కూడా చాలాసార్లు కుప్పం వెళ్లాడు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ఈ ఎన్నికల్లో ఓడిపోతానని నారా వారు భయపడుతున్నారు. దీంతో గెలుపు కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.
సరిహద్దుల్లోని కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అక్కడ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నుంచి అనేకమంది బాబుకు అత్యంత సన్నిహితులున్నారు. దీంతో వారి ద్వారా భారీ ఎత్తున మద్యంను దిగుమతి చేయించాడు. ఈ విషయంలో ఆ రాష్ట్ర యంత్రాంగం టీడీపీ అధినేతకు బాగా సహకరించినట్లు ప్రచారం జరుగుతోంది. మద్యం తెప్పించడం, పంపిణీ చేసే బాధ్యతను సీనియర్ నేతలకు అప్పగించాడు. టెట్రా ప్యాకెట్లను పెద్ద ఎత్తున తెప్పించినట్లు ప్రచారం జరుగుతోంది.
బాబు 14 సంవత్సరాలపాటు సీఎంగా పనిచేసినా ఈ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి శూన్యం. పరిశ్రమలు తీసుకురాలేదు. ప్రైవేట్ సంస్థలు లేవు. దీంతో ప్రజలు ఉపాధి నిమిత్తం వేరే ప్రాంతాలకు వలస వెళ్తుంటారు. దినసరి కూలీలే అధికంగా ఉన్నారు. వీరిని, తెలుగు తమ్ముళ్లను ప్రలోభపెట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. రోజూ పనికి వెళ్లే వచ్చే డబ్బుకు రెండింతలు, ఉదయం, సాయంత్రం మద్యం బాటిళ్లను చంద్రబాబు మనుషులు ఇస్తున్నట్లు తెలిసింది. గెలుపు కోసం టీడీపీ తొక్కుతున్న అడ్డదారుల్ని చూసి ప్రజానీకం ఛీ కొడుతోంది. విజనరీ, 40 ఇయర్స్ ఇండస్ట్రి అని చెప్పుకొనే వ్యక్తి దిగజారి ప్రవర్తిస్తున్నాడంటూ ప్రజాస్వామ్యవాదులు మండిపడుతున్నారు.