Chandrababu : ఇది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి భగవద్గీత అయితే.. తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మాత్రం చిత్తు కాగితం. ఎందుకంటే ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఆయనకు హామీలు ఘనంగా ప్రకటించాడే తప్ప.. జగన్‌లా నెరవేర్చలేదు. అధికారంలోకి రావడం కోసం బాబు ప్రతి ఎన్నికల్లో వందల సంఖ్యలో హామీలు గుప్పించే బాబు సీఎం అయ్యాక మాత్రం వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. గత చరిత్ర ఇదే చెబుతోంది. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చాక మేనిఫెస్టోని పార్టీ అధికారిక వెబ్సైట్ నుంచి తొలగించించారు. అదే జగన్‌ను చూస్తే తన కార్యాలయంలోనే మేనిఫెస్టోను బ్యానర్ల రూపంలో ఏర్పాటు చేయించారు. క్యాలెండర్ ప్రకటించి మరీ ఒక్కో హామీని నెరవేర్చుకుంటూ పోయారు. కోవిడ్ సమయంలోనూ ఆయన వెనుకంజ వేయలేదు.
మొదటి నుంచి బాబంతే..
ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు మొదటి నుంచి దిట్ట. 1994లో ఎన్నికలు జరిగిన కొంతకాలానికే తన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యాడు. ఆ ఎలక్షన్లలో తెలుగుదేశం మేనిఫెస్టోలో ప్రధాన హామీలు రెండు రూపాయలకు కిలో బియ్యం, సంపూర్ణ మద్యపాన నిషేధం, 50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్.. ఎన్టీఆర్ ఆశయాలు కొనసాగిస్తానని అనేకసార్లు చెప్పిన బాబు టీడీపీ ఎన్నికల హామీల గురించి మాత్రం పట్టించుకోలేదు. అలా ఆయన మోసాల ప్రస్థానం మొదలైంది. 1999లో బాబు సీఎం అయ్యాడు. ప్రజలకు మంచి చేయడం వల్ల మాత్రం కాదు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ప్రధాని వాజ్‌పేయి పట్ల ఏర్పడిన సానుకూల పవనాలు తెలుగుదేశానికి బాగా ఉపయోపగపడ్డాయి. ఆ గాలిలో బాబు సీఎం అయ్యారు. 99 ఎన్నికల సమయంలో నారా టీడీపీ మేనిఫెస్టోలో కోటి ఉద్యోగాలు, రూ.100 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, సంవత్సరానికి ఏడు లక్షల ఇళ్ల నిర్మాణం తదితరాలను ప్రకటించింది. అయితే తన పదవీ కాలంలో చంద్రబాబు ఒక్క దానిని కూడా నెరవేర్చలేదు. పచ్చపత్రికల్లో మాత్రం తన కంటే వీరుడు.. సూరుడు లేడని రాయించుకున్నారు. 2004 ఎన్నికల్లో జనం వాతలు పెట్టి ఇంటికి పంపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యి జనానికి ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నారు. రాష్ట్ర విభజన జరిగాక 2014లో ఎన్నికలు జరిగాయి. ఇక్కడ బాబు ఒంటరిగా వెళ్లే ధైర్యం చేయలేదు. నరేంద్రమోదీ గాలి బాగా వీస్తోందని గుర్తించి బీజేపీ, కాపుల ఓట్ల కోసం జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. ఫలితంగా సీఎం పీఠం ఎక్కారు. ఈ ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు సంపూర్ణ రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, పొదుపు రుణమాఫీ ప్రకటించారు. పదవిలో ఉన్నన్ని రోజులు రాజధాని అమరావతి పేరుతో దోచుకున్నారు తప్ప ప్రజల కోసం ఏమి చేయలేదు. నమ్మి అధికారం ఇస్తే నట్టేట ముంచారు. ఓటర్లు ఓడించి జగన్‌కు అధికారం ఇచ్చారు.
ఈసారి ఇలా..
2024 ఎన్నికలు సమీపిస్తుండటంతో సభల్లో బాబు హామీల మీద హామీలు గుప్పిస్తున్నారు. ఈసారి గెలిస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాడట. గతంలో ఈ పని ఎందుకు చేయలేదో మాత్రం చెప్పడు. పైగా నేనెప్పుడు చెప్పానంటాడు. ఆక్వా రైతులకు రూ.1.50 కరెంట్ ఇస్తానంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ హామీలను కాపీ కొట్టి ఆరు గ్యారెంటీలు ప్రకటించాడు. అయితే జనం ఆయన్ను, టీడీపీని, వాళ్ల మేనిఫెస్టోను నమ్మే పరిస్థితి లేదు. ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారైనా చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు చేసి ఉంటే నిన్ను నమ్మం బాబూ అనే పరిస్థితి వచ్చేది కాదు. పచ్చ పత్రికలు, మీడియా చేతిలో ఉన్నాయిలే.. అంతా వాళ్లు చూసుకుంటా రనుకుంటూ మోసాలతోనే బతికేస్తున్నాడు. ఆయన వెనక్కి తిరిగి చూసుకుంటే అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు, మాయలు, హత్యాకాండలు, వెన్నుపోటు రాజకీయాలు మాత్రమే కనిపిస్తాయి. లబ్ధి పొందిన పేదవాడి చిరునవ్వు ఎంత వెతికినా కనిపించదు. ఇదే నిజం.