గతంలో అంటే చంద్రబాబు నాయుడు పరిపాలన కాలంలో పెన్షన్లు తీసుకోవాలి అంటే జన్మభూమి కమిటీల చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉండేది. అర్హత ఉన్నప్పటికీ కూడా పెన్షన్ కావాలంటే అప్పట్లో అధికార టిడిపి నాయకుల చుట్టూ వెంపర్లాటే సరిపోయేది. టిడిపి నాయకులను ప్రసన్నం చేసుకున్నప్పటికీ కూడా పెన్షన్ వస్తుందా లేదా అనేది ఒక మీమాంస లాగే మిగిలిపోయేది. ఎందుకు ఉంటే అర్హత మాట దేవుడు ఎరుగు పెన్షన్ ఇవ్వాలంటే కచ్చితంగా అర్హుదారులు ఆ పార్టీకి అనుకూలంగా ఉండటమో లేదా నాయకులకు అందుబాటులో లేకపోతే జన్మభూమి కమిటీలు సిఫార్సు చేసేవి కాదు. ఒక రకంగా చెప్పాలి అంటే అప్పట్లో జన్మభూమి కమిటీలు సిఫార్సు చేసిన వారికి మాత్రమే పెన్షన్ ఇతరత్రా ప్రభుత్వ పథకాలు అందేవి.
అయితే వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత గతంలో ఉన్నటువంటి పరిస్థితికి భిన్నంగా అడుగులు ముందుకేసాడు. కులమతాలకు రాజకీయాలకు పార్టీలకు అతీతంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందించే విధంగా సరికొత్త విధానాన్ని పరిచయం చేశాడు.. గంటల గంటలు తరబడి పంచాయతీల చుట్టూ జన్మభూమి కమిటీల చుట్టూ ఎండ వాన తెలియకుండా నిలబడి వెంపర్లాడే పరిస్థితి నుంచి పెన్షన్లు తమ కాళ్ళ దగ్గరకే వచ్చే విధంగా వాలంటరీ వ్యవస్థతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. నడవలేని కథలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి అవ్వా తాతలకుచాలా ఉపశమనం కలిగింది. ప్రతినెలా ఒకటో తారీఖున టెన్షనుగా పింఛను కోడి కూయక ముందే చేతికి అందింది.
ఇక్కడే ప్రత్యర్థి ప్రతిపక్ష పార్టీలకు కన్ను కుట్టింది. ఏ సంక్షేమ పథకమైనా సరే ఏ అభివృద్ధి కార్యక్రమమైనా సరే వాలంటీర్లు ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ప్రతి గడపకు అందించేసరికి చంద్రబాబు అండ్ కో కి అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రభుత్వం మీద ద్వేషం మొదలైంది. ఆద్వేషంతోనే వాలంటీర్లను టెర్రరిస్టులతో పోల్చాడు టిడిపి అభ్యర్థి బొజ్జల సుధీర్.. రేపు జరగబోయే 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్లు పెన్షన్లు పంచకూడదు అని వాలంటీర్లపై ఎన్నికల సంఘానికి మేమే ఫిర్యాదు చేశామని చెప్పాడు టిడిపి అభ్యర్థి ఆది రెడ్డి వాసు.. ఒక దశలో చంద్రబాబు సైతం వాలంటీర్లను అవమానిస్తూ వాలంటీర్లు గోనె సంచులు మోసే వారని, అర్ధరాత్రి వేళ తలుపులు కొట్టే వారని చంద్రబాబు వాలంటీర్లను తీవ్రంగా కించపరిచాడు. ఇక ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే వాలంటీర్లు మహిళల అక్రమ రవాణా కి పాల్పడుతున్నారని అత్యంత జుగుప్సాకరంగా వాలంటీర్లను అవమానించాడు. ఈ నేపథ్యంలో ఇంటింటికి ప్రభుత్వ సేవలు పార్టీలకు రాజకీయాలకు కులమతాలకు అతీతంగా నిస్పక్షపాతంగా అందాలంటే దుష్ట కూటమిని చిత్తుగా ఓడించి ఇంటికి పంపాల్సిందేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.