రాష్ట్రానికి చెందిన నాయకులు వారి పరిధిలోని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పడం సర్వసాధారణం. కానీ వేరే రాష్ట్రంలోని ఊరిని.. అది కూడా మహానగరాన్ని డెవలప్ చేస్తామని చెప్పడం మాత్రం తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికే చెల్లింది. అల్జీమర్స్ ఎక్కువైందో లేక.. ఎన్డీఏలో చేరాను కదా.. ఈసారి తనను ప్రధానమంత్రి చేస్తారేమోనని భావించాడో.. నెల్లూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ‘నెల్లూరు – తిరుపతి – చెన్నైలను ట్రైసిటీగా అభివృద్ధి చేస్తాం.. ఈ ప్రాంతాన్ని హార్డ్‌వేర్, ఎలక్రా్టనిక్స్ హబ్‌గా తీర్చిదిద్దుతాం’ ప్రకటించారు నారా వారు. ఇలా ప్రధాని, కేంద్ర మంత్రులు చెబితే ఒక అర్థముంది. కానీ బాబు మాత్రం నెల్లూరు నగరానికి సుమారు 180 కిలోమీటర్ల దూరంలో తమిళనాడు రాష్ట్రంలో ఉన్న చెన్నై నగరాన్ని కూడా అభివృద్ధి చేస్తానని చెప్పి తెలుగు తమ్ముళ్లే నోరెళ్లబెట్టేలా చేశాడు.
మీనాయన్ను అలా వదిలేయకండ్రా.. కూర్చోబెట్టి చెప్పండ్రా.. లేకపోతే ఎవరికైనా చూపించండ్రా అని లోకేశ్‌కు సీనియర్ నాయకులు చెప్పే పరిస్థితులు వచ్చేశాయి. బాబు లేస్తే 40 ఇయర్స్ ఇండస్ట్రి అంటాడు. కానీ చెన్నై ఎక్కడుందో అవగాహన లేకుండా అభివృద్ధి చేసేస్తాన్నాడు. దాన్ని ఎల్లో మీడియా ప్రచురించడం హైలెట్. నెల్లూరు, తిరుపతిని అభివృద్ధి చేస్తామంటే ఓకే. మరీ చెన్నై వరకూ ఎందుకెళ్లారో.. పిచ్చిపిచ్చిగా మాట్లాడడం బాబుకు ఇదేం కొత్త కాదు. గతంలోనూ చాలా సందర్భాల్లో నోటికొచ్చింది చెప్పాడు. కుప్పం కూరగాయలను విమానాల్లో విదేశాలకు పంపిస్తానన్నాడు. దీంతో అక్కడి వారే ఆశ్చర్యపోయారు. మీరు పండించే కూరగాయలకు మార్కెట్ సౌకర్యం కల్పిస్తానంటే పోయేదానికి అమెరికా పంపుతా.. బ్రిటన్‌లో దొరికేలా చేస్తానడం విడ్డూరమే కదా..
2014 ఎన్నికల సమయంలో బాబు ఇచ్చిన హామీలను చూస్తే ఇప్పటికీ చాలామంది నోరెళ్లబెట్టడం ఖాయం. దేశానికి బుల్లెట్ ట్రైన్ తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వాలకు చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తుంటే సాధ్యపడలేదు. కొన్నేళ్ల క్రితం ఎన్డీఏ పనులు ప్రారంభించింది. అయితే రైలు ఎప్పటికీ ప్రారంభమవుతుందో ఇంకా పూర్తిగా తెలియని పరిస్థితి. అలాంటిది బాబు మాత్రం ఏపీలో బుల్లెట్ ట్రైన్లు తిప్పేస్తానన్నాడు. అసలు మెట్రోకు సంబంధించిన పనులే కేంద్రం చేతిలో ఉంటాయి. అయినా బుల్లెట్ రైళ్లంటూ మాయమాటలు చెప్పాడు. బాబును ఇలాగే వదిలేస్తే 2029లో జరిగే ఎన్నికల్లో అమెరికాను కూడా లాగుతాడు. తనకు అధికారమిస్తే ఆ దేశాన్ని అమరావతితో అనుసంబంధానం చేస్తానని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నిజంగా అట్లుంది బాబుతోని.. ఇంతకీ చెన్నైలో ఏ ప్రాంతంలో హార్డ్‌వేర్, ఎలక్రా్టనిక్స్ హబ్ పెడుతారు నారా వారూ.. ఆ విషయం కాస్త చెబితే మురళీమోహన్, నారాయణ, కులపెద్దలు ముందుగానే స్థలాలు కొనుక్కుంటారు కదా..