పల్నాడు జిల్లా పిడుగురాళ్ల అయ్యప్పనగర్ బైపాస్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థను చూస్తుంటే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పెరిగెడుతున్నాయన్నారు.
ఊసరవెల్లిని మించి రంగులు మారుస్తున్న చంద్రబాబును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎండగట్టారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల అయ్యప్పనగర్ బైపాస్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థను చూస్తుంటే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పెరిగెడుతున్నాయన్నారు.
వాలంటీర్లకు రూ.10వేలు ఇస్తామని చంద్రబాబు అంటున్నాడు. ఇలాగైనా జగన్ పాలన బావుందని చంద్రబాబు ఒప్పుకున్నాడు. ఇన్నాళ్లూ వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు విషం చిమ్మారు. ఇప్పుడు వాలంటీర్లకు రూ. 10వేలు ఇస్తామంటున్నారు.. ఇంతకంటే జగన్ పాలనకు మీరిచ్చే సర్టిఫికెట్ ఏం ఉంటుంది?. ప్రజలు తిరగబడే సరికి చంద్రబాబు మారిపోయాడు. ఇప్పుడు వాలంటీర్లను మెచ్చుకుంటున్నారు. మంచి చేశాం కాబట్టే ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్నాం అని సీఎం జగన్ పేర్కొన్నారు.
ఊసరవెల్లి కంటే చంద్రబాబు ఎక్కువ రంగులుమారుస్తాడు. జన్మభూమి కమిటీలతో చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకున్నారు. చంద్రబాబు బతుకంతా అబద్ధాలు, వెన్నుపోట్లే. చంద్రబాబు ఊసరవెల్లిని దాటిపోయారు. చంద్రబాబు మోసాలు అందరికి తెలుసు. రాష్ట్రాన్ని దోచుకోవడం, దోచుకున్నది దాచుకోవడం బాబు మనస్తత్వం. అవ్వాతాలకు ఇంటి వద్దే అందాల్సిన పెన్షన్ ఆపారు. నిమ్మగడ్డ రమేష్తో ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు చేయించారు. అవ్వాతాతలను ఇబ్బంది పడేలా చేశారని సీఎం జగన్ ధ్వజమెత్తారు. మనం ప్రజలకు మంచి చేసాం కాబట్టే అవే కొనసాగిస్తాం అని చంద్రబాబు అంటున్నాడు. చంద్రబాబు 14 సంవత్సరాల పాలనలో ప్రజలకు పాలనా మంచి చేశాను అని చెప్పుకోలేకపోతున్నాడు. ప్రజలు ఈ తేడాని గమనించాలని జగన్ మోహన్ రెడ్డి కోరారు.