నాలుగు దశాబ్ధాలుగా అంతుచిక్కని కారణాలతో, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులతో బాదపడుతున్న ఉద్దానం ప్రజలకి ప్రతిపక్ష హోదాలో తాను ఇచ్చిన మాటను నెరవేరుస్తూ శాశ్వత పరిష్కారం చూపుతూ నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గారు 742 కోట్ల వ్యయంతో వైఎస్సార్ సుజలధార మంచినీటి ప్రాజెక్టు, 85 కోట్ల వ్యయంతో 200 పడకల డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రిని ఏర్పాటుచేశారు. ఈ రెండింటినీ నేడు ప్రారంభించి ఉద్దానం ప్రజలకు ఊపిరి అందించారని చెప్పొచ్చు .
జగన్ గారు చూపిన చొరవతో ఉద్దానం ప్రజల గుండెల్లో ఆయనకి ఎక్కడ చెరగని స్థానం ఏర్పడుతుందో అన్న కుంచిత మనస్తత్వంతో చంద్రబాబు అయనకి వంతపాడే పత్రికలు తమకి బాగా అలవాటైన నేనే , నావల్లే రాగాన్ని అందుకున్నారు. తెలుగుదేశం పార్టీ 5ఏళ్ళు అధికారంలో ఉండగా ఏమాత్రం పట్టించుకోని వీళ్ళు మేము నాడే డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేశాం, 2500 పింఛన్ అందించాం అని చెప్పడమే కాకుండా ఇంకో అడుగు ముందుకు వేసి సురక్షితమైన తాగునీటి సరఫరాకి కూడా అడుగులు వేసాం అంటూ పచ్చి అబద్దాలను తమ అనుకూల పత్రికల్లో రాయించుకున్నారు.
వాస్తవం చూస్తే 200 పడకల డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రి ఏర్పాటుకి జగన్ గారు అధికారంలోకి రాగానే 03.09.2019న జీఒ నెంబర్ 102 విడుదల చేశారు. చంద్రబాబు పాలనలో 2017లో జాతీయ ఉచిత డైయాలసిస్ ప్రోగ్రాం ద్వార కేంద్రం సోంపెట, కవిటి, పలాస, టెక్కలి ప్రాంతాల్లో డయాలసిస్ యూనిట్లను కేంద్రం ఏర్పాటు చేసిందే కాని ఇందులో చంద్రబాబు చేసింది సూన్యం . ఇక గత ప్రభుత్వం డయాలసిస్ రోగులకి 20 రకాల మందులు మాత్రమే అది అరాకొరాగా ఇచ్చేది .
జగన్ గారి ప్రభుత్వం వచ్చాక వారికి 37 రకాల మందులు అందుబాటులోకి తెచ్చారు.
ప్రతిపక్షనేత జగన్ గారు 2017 ప్లీనరీలో రాష్ట్రంలో ఉద్దానం మాదిరి సమస్యతో భాదపడుతున్న కిడ్నీ భాదితులకి పెన్షన్ ఇస్తాం అని ప్రకటించగానే తెలుగుదేశం ఆగమేఘాల మీద 2,500 పెన్షన్ ప్రకటించటం తెలిసిందే. జగన్ గారు అధికారంలోకి రాగానే ఆ పెన్షన్ ని 10వేలు చేశారు. అలాగే శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతాన్ని వేధిస్తున్న కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ 700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టుకు 2019 సెప్టెంబర్ లో శంకుస్థాపన చేసి 16-01-2020న 700 కోట్లు మంజూరు చేస్తూ జీఓ నెంబర్ 240 విడుదల చేసి. వేగంగా పనులు పూర్తి చేశారు.
చంద్రబాబు శంకుస్థాపన రాళ్ళ చరిత్ర ఈ రాష్ట్ర ప్రజలకు తెలియంది కాదు. రాళ్లు వేయడంలో చూపిన చిత్త శుద్ది ఏళ్ళు గడిచినా వాటి ఫలాలను ప్రజలకు అందించటంలో చూపించడు బాబు . దీనికి ఎన్నో ఉదాహరణలు కూడా ఉన్నాయి. కారణం తనకి కావలసింది పేరు మాత్రమే కాని ప్రజలకు జరిగే మేలు కాదు. ఎవరైనా మేలు చెస్తే అది నావల్లే అని చెప్పుకోవడానికి తహ తహలాడిపోతాడు చంద్రబాబు.. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి అసలు ఏమీ చేయని ఉద్దానం ప్రాజెక్టులో కూడా తన వాట ఉంది అని చెప్పుకోవడం చూస్తే చంద్రబాబులో మార్పు రాకపోగా ప్రచార పిచ్చి మరింత పెరిగిందని చెప్పొచ్చు