తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మారడు. ఆయన ఏనాడూ ఆరోగ్యకర రాజకీయాలు చేయలేదు. తనకు గిట్టని వారిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తూనే ఉంటాడు. ఎన్టీఆర్ నుంచి నేడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వరకు కక్ష సాధింపు ధోరణిలోనే వ్యవహరించాడు.
ముఖ్యమంత్రి పదవి కోసం నాడు తన మామ ఎన్టీ రామారావుపై చెప్పులు వేయించాడు. చివరికి ఆయన మానసికక్షోభతో చనిపోయాడంటే బాబు ఏ స్థాయిలో ఇబ్బంది పెట్టాడో అర్థం చేసుకోవచ్చు. కాలక్రమంలో టీడీపీ అధినేత ఇంకా ఆరితేరాడు. ప్రత్యర్థులపై రాళ్లు వేయించడం మొదలుపెట్టాడు. హత్యా రాజకీయాలకు తెరతీశాడు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాక వికృత క్రీడలు అధికమయ్యాయి. అమిత్‌షా తిరుపతికి వస్తే కాన్వాయ్‌పై తెలుగు తమ్ముళ్ల ద్వారా రాళ్లు వేయించాడు. ఆరోజు ఆయన త్రుటిలో తప్పించుకున్నారు. చేయాల్సిందంతా చేయడం.. తర్వాత తనకేం సంబంధం లేదని, వారే చేయించుకుని తమపై తోస్తున్నారని అనడం నారా వారికి వెన్నతో పెట్టిన విద్య. తానా అంటే తందానా అనేందుకు చేతిలో ఎల్లో మీడియా ఉంది.
జగన్ విషయంలో బాబు రెండడుగులు ముందుకేశాడు. ఆయన్ను అంతమొందిస్తే రాజకీయంగా ఎదురుండదని భావించాడు. 2019 ఎన్నికల సమయంలో విశాఖ ఎయిర్‌పోర్టులో కోడి కత్తితో పొడిపించి చంపాలని చూశాడు. ఇదంతా తెలుగుదేశం చేసిందని బయటపడినా ఎన్నికల్లో సింపతీ కోసం వైఎస్సార్సీపీ డ్రామా ఆడుతుందని నీచంగా మాట్లాడారు. 2024లో కూడా గెలిచే పరిస్థితి లేదని జగన్‌ను లేకుండా చేయాలని బాబు రాయి వేయించాడని ప్రచారం జరుగుతోంది. అప్పటిలాగే ఈసారి కూడా వైఎస్సార్సీపీ డ్రామా అంటూ పచ్చ గ్యాంగ్ ప్రచారం మొదలుపెట్టింది.
చంద్రబాబు అండ్ కోకు మానవత్వం మచ్చుకైనా లేదు. జగన్ రక్త గాయమై బాధపడుతుంటే మరో డ్రామా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇటీవల పవన్ కళ్యాణ్ తనను చంపడానికి బ్లేడ్ బ్యాచ్ తిరుగుతోందని చెప్పగానే.. తమ వాడు కాబట్టి ఆయనకు వంత పాడారు. వైఎస్సార్సీపీ మీద నెపం నెట్టే ప్రయత్నం చేశారు. కానీ సేనాని లేకపోతే ఎక్కువ లాభపడేది టీడీపీనే. కాబట్టి జనసైనికులు జాగ్రత్తగా ఉండండి. చంద్రబాబు ఎంతకైనా తెగిస్తాడు. మీ వాడిని ఏదో ఒకటి చేయించి జగన్ చేయించాడని రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తాడు.