ఎన్నికలకు మూడు నెలల ముందు పెంచింది అయిదేళ్లుగా ఇస్తున్నట్టు అసత్యపు వార్తలు .
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోబెల్స్ వారసులుగా ముద్రపడ్డ తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలు మరోసారి చంద్రబాబు పాలనలో పెన్షన్ల పంపిణీపై పిట్టకధలు, కట్టుకధలు అచ్చువేసి ప్రజలని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాయి. చంద్రబాబు అధికారంలో ఉండగా ఆయన భజన తప్ప సామాన్య ప్రజల భాదలు, వారి ఇబ్బందులు పట్టని ఈ పచ్చ పత్రికలు బాబు అధికారంలో నుండి దిగిపోయాక ఆయన పాలనా కాలంలో సాగించిన అస్తవ్యస్త పాలనని గొప్ప పాలనగా చిత్రీకరించే ప్రయత్నం మాత్రం మానుకోదు.
ముఖ్యమంత్రి జగన్ గారు నాడు ఎన్నికల్లో పెన్షన్లు పెంచుకుంటూ పోతాం అని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ నేడు పెన్షన్ 3వేలు పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపద్యంలో బాబు పాలనలో పెన్షన్ల పై అర్ధసత్యాలను మరోసారి పచ్చపత్రికలు ప్రచారంలోకి తీసుకుని వచ్చాయి. చంద్రబాబు 2వేలు పెంచన్ ఇచ్చినట్టు, అలాగే 50 లక్షల మందికి పెస్షన్ ఇచ్చినట్టు కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం చంద్రబాబు 1000 రూపాయలే పెన్షన్ ఇచ్చినట్టు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని, అలాగే చంద్రబాబు కేవలం 39లక్షల మందికే పెన్షన్ ఇచ్చినట్టు ప్రచారం చేస్తున్నారని తీవ్రమైన ఆవేదనకి లోనయ్యాయి పచ్చ పత్రికలు ..
వేయి రూపాయలు ఇస్తున్న పెన్షన్ ని చంద్రబాబు ఏ సందర్భంలో 2వేలు చేశారు. లబ్దిదారుల సంఖ్య ఎప్పుడు పెరిగింది అనే విషయాలు మాత్రం చెప్పి చెప్పనట్టు అచ్చువేసి, ప్రజలని తప్పుదోవ పట్టించే కార్యక్రమానికి తెరలేపారు. నిజానికి చంద్రబాబు పాలనలో పెన్షన్ రావాలంటే లబ్దిదారులకి ఉండాల్సిన ఒకే ఒక అర్హత జన్మభూమి కమిటీల ఆశీస్సులు ఉండాలి . వారికి వచ్చే పెన్షన్ లోనుండి కాస్త వాట జన్మభూమి కమిటీల అవతారం ఎత్తిన తెలుగు తముళ్ళకి ఇవ్వాలి .
అర్హత ఉన్నా పెన్షన్ ఇవ్వకుండా తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ మెంబర్లు తనను ఎలా వేదిస్తున్నారో చెప్పటానికి నాడు మహానాడుకి వచ్చిన నారావారిపల్లెకి చెందిన పార్వతమ్మని పోలీసులచేత కొట్టించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిది. నాకు వోటు వేయని వారికి నేనే ఎందుకు పెన్షన్ ఇవ్వాలి అని నేరుగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు మాట్లాడిన మాటలు ఇంకా ఎవరు మర్చిపోయి ఉండరు. ఇంత అస్తవ్యస్త పాలనను చూసిన జగన్ గారు పాదయాత్రకు ముందు 2017లో జరిగిన ప్లీనరీ సమావేశంలో తాను అధికారంలోకి వస్తే ఇప్పుడు చంద్రబాబు ఇస్తున్న పెన్షన్ 1000 రూపాయలను 2వేలు చేస్తానని ప్రకటించారు. జగన్ గారి ప్రతిపక్ష హోదాలో చేసిన ఈ ప్రకటనకు ప్రజల నుండి ఆపూర్వ స్పందన వచ్చిన నేపధ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం కూడా అప్పటి వరకు ఇస్తున్న 1000 రూపాయల పెన్షన్ ని 2వేలు చేయబోతునట్టు లీకులు ఇచ్చాయి.
దీంతో జగన్ గారు 2017 నవంబర్ నేలలో పాదయాత్రలో భాగంగా వేంపల్లెలో జరిగిన సభలో “నేను ప్రకటించిన వెంటనే చంద్రబాబు ప్రభుత్వం కూడా 2వేలు ఇవ్వబోతునట్టు లీకులు ఇస్తుంది .. ఇస్తే మంచిదే మన ప్రభుత్వం వస్తే దానిని మూడువేలకి పెంచుకుంటూ పోతానని ఆ సభలో ప్రకటించారు. దీంతో ఎన్నికలకి సరిగ్గా మూడు నెలలు ఉందనగా ఓట్ల కోసం చంద్రబాబు 2019 జనవరిలో పెన్షన్ 2వేలు చేశారు. అలాగే 39 లక్షల మంది లబ్దిదారులను ఉన్నట్టుండి 50 లక్షల మందయ్యారు.
దీన్ని బట్టి చూస్తే కొత్తగా పెన్షన్లు పొందిన వారికి అర్హత ఉన్నా 5ఏళ్ల పాటు పెన్షన్ ఇవ్వలేదనే కదా. 5ఏళ్ళు కూడా 1000 రూపాయలు మాత్రమే ఇచ్చారనే కదా, ఇదే కదా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. ఈ నిజాలని దాచిపెట్టి చంద్రబాబు పాలనలో ఎంతో గొప్ప జరిగిందని ఆ గొప్పని వైసీపి ప్రభుత్వం దాచిపెడుతుందని పచ్చ పత్రికలు ఆవేదన చెందడం చూస్తే. పత్రికల మాటున చంద్రబాబుని కాపాడే రాక్షస ప్రయత్నమే కనిపిస్తుంది తప్ప ప్రజలపైన కాస్త కనికరం కూడా కనిపించడంలేదు.