2019 ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న టీడీపీ పార్టీ తమను ఓడించిన ఏపీ ప్రజలపై కక్ష గట్టి మొదటి రోజు నుండి ఆ పగ తీర్చుకుంటూనే ఉంది.. ప్రభుత్వం ఏ మంచి కార్యక్రమం తలపెట్టినా ఆ కార్యం ముందుకు సాగనీయకుండా కోర్టు ల ద్వారా కాలయాపన చేయడమో, లేక పూర్తిగా అడ్డుకోవడమో చేస్తూనే ఉంది. తాజాగా వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇచ్చే పద్దతిని నిలిపివేయాలని ఈసి ని కోరి సఫలీకృతం అయిన వారు గతం లో కూడా ఇలాంటి అడ్డుపుల్లలు ఎన్నో వేశారు…
పేద పిల్లలు ఇంగ్లిష్ మీడియం లో చదవాలి అని ప్రభుత్వ బడిలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెడితే అది తప్పని, పేద పిల్లలు ఇంగ్లిష్ మీడియం చదవడం వల్ల తెలుగు అంతరించిపోతుంది అని కోర్టు కు వెళ్లారు…
విడతల వారీగా మద్యపాన నిషేధం చేస్తామని, అందులో భాగంగా ముందుగా మద్యం రేట్లు పెంచి మద్యం ధర వింటేనే షాక్ కొట్టేలా చేస్తానని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి మద్యం రేట్లు పెంచి, పక్క రాష్ట్రాల నుండి అక్రమంగా మద్యం సరఫరా కాకుండా అడ్డుకుంటే,కోర్టు కి వెళ్లి పక్క రాష్ట్రాల నుండి 3 సీసాలు తెచ్చుకుంటాం అని కోర్టు కు వెళ్లారు…పేదలకు పక్కా ఇళ్లుండాలి అని సంకల్పించిన జగన్, రాష్ట్రవ్యాప్తంగా 32 లక్షల ఇళ్ల పట్టాలు అందజేస్తే, పేదలకు ఇళ్ల స్థలాలివ్వడం వలన గేదలకి గడ్డి దొరకదు అని కోర్టు కి వెళ్లారు…
అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి జరగాలని, అభివృద్ధి వికేంద్రీకరణ జరిపి భవిష్యత్తు లో ప్రాంతీయ విభేదాలు తలెత్తకుండా చూడాలని మూడు రాజధానులను ప్రకటిస్తే, తమ భూముల్లోనే రాజధాని ఉండాలి, వైజాగ్ కు రాజధాని అయ్యే అర్హతే లేదని కోర్టుకు వెళ్లారు..రాజధాని లో పేదలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే రాజధాని ప్రాంతం లో డెమోగ్రాఫిక్ ఇంబాలెన్స్ అంటే తమ ప్రాబల్యం తగ్గుతుందని కోర్టు కు వెళ్లి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుపడ్డారు…
రాయలసీమ లిఫ్ట్ కోసం 44 వేల క్యూసెక్కుల పెంపు కి పనులు ప్రారంభిస్తే కోర్టు కి ఆపారు…నాడు- నేడు కింద బడులు బాగు చేస్తుంటే కాంట్రాక్టు ల కోసమే అని కోర్టుకెక్కారు…గ్రామసచివాలయాలు, రైతు భరోసా సెంటర్లు కడుతుంటే 44 వేల కోట్లు రంగులు వేయడానికి వాడారని కనీస అవగాహన లేకుండా కోర్టుకు వెళ్లారు…
కరోనా సమయంలో సేవ చేస్తున్న బియ్యం మధుసూదన్ రెడ్డి తో సహా ఇతర నాయకుల మీద అలా చెయ్యడానికి వీలు లేదు అని కోర్టులో కేసులు వేసింది చేసే వాళ్ళని కూడా చేయకుండా అడ్డు తగిలారు. తాము ఏ నాడూ సేవ చేయకుండా హైదరాబాద్ లో ఇంటి నుండి బయటికి కూడా రాలేదు..
ఇలా తాము చేయరు చేసేవారిని చేయనివ్వరు. కానీ ఏ ధైర్యం తో జనాలను మళ్లీ ఓట్లు అడుగుతారో కానీ ప్రజలు అవన్నీ మర్చిపోతారనేది వారి ధైర్యం కాబోలు…