2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన టిడిపిలో ఇంకా దాదాపు 8 నుంచి 10 సీట్లలో అభ్యర్థులు మార్పు ఉండొచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికలకు సంబంధించి నిన్న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కూడా అయింది. అయినా టిడిపిలో అభ్యర్థుల ఎంపిక, మార్పుచేర్పులు ఇంకా కొలిక్కి రాని పరిస్థితి. టిడిపి పోటీ చేయబోయే 144 స్థానాలకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థులను ప్రకటన తర్వాత వారికి కేటాయించిన నియోజకవర్గాల్లో వాళ్లు పూర్తిస్థాయిలో పనిచేసుకుంటున్న సందర్భంలో టికెట్లు మార్పుకు టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సిద్ధమైనట్లు సమాచారం.
టిడిపి మార్పులు చేయాలనుకుంటున్న ఆ నాలుగు నియోజకవర్గాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రస్తుతానికి ఉండి, మాడుగుల, మడకశిర, తంబళ్లపల్లె నియోజవర్గాలు ఉన్నాయి. ఉండి నియోజకవర్గాన్ని మొదట ప్రస్తుత శాసనసభ్యుడు రామరాజుకి టికెట్ కేటాయించారు. కాగా ఆ సీట్ ను ఇప్పుడు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుకి ఇవ్వాలని నిర్ణయించారు. కూటమి లో భాగంగా నరసాపురం ఎంపీ అభ్యర్థిగా తాను పోటీ చేయాలని రఘు రామ భావించగా ఆ సీట్ ని బిజెపికి చెందిన శ్రీనివాస్ వర్మకు బిజెపి బీఫామ్ అందజేయడంతో , ఆ జిల్లా పరిధిలో ఉన్న ఉండి నియోజకవర్గం సీట్ ను రఘురామాకి కేటాయించారు. ప్రస్తుత ఎమ్మెల్యే రామరాజుకి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చి బుజ్జగించే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. రామరాజు ఏమాత్రం రఘురామకి సహకరిస్తాడో చూడాలి.
అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గానికి సంబంధించి మొదట ఎన్నారై పైలా ప్రసాద్ కి టికెట్ కేటాయించారు. కానీ ఇప్పుడు ఆ సీట్ ను తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి కేటాయించారు. పెందుర్తి నియోజకవర్గానికి చెందిన బండారుకి మొదట సీట్ కేటాయించలేదు. కూటమిలో భాగంగా పెందుర్తి సీట్ ను జనసేనకు కేటాయించడంతో పార్టీపై అలిగిన సత్యనారాయణమూర్తి పూర్తిగా ఇంటికి పరిమితమయ్యాడు. టిడిపి పార్టీ వారు ఎంత బుజ్జగించాలి అని ప్రయత్నించిన వినకపోయేసరికి మాడుగుల సీటు కేటాయించినట్లు సమాచారం.
హిందూపూర్ పార్లమెంట్ లోని మడకశిర నియోజకవర్గానికి సంబంధించి మొదట అనిల్ కుమార్ కి సీట్ కేటాయించారు. అనిల్ కుమార్ కి సీట్ కేటాయించడంతో టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి తీవ్రంగా వ్యతిరేకించాడు. ఇప్పుడు ఆ సీట్ ని టిడిపి పార్టీ రాష్ట్ర దళిత విభాగం అధ్యక్షుడు ఎం ఎస్ రాజు కి ఇవ్వాలని నిర్ణయించారు. ఎం ఎస్ రాజుకి మొదట బాపట్ల ఎంపీ సీట్ ఇవ్వాలని అనుకున్న, రాజుకి ఆ సీటు దక్కలేదు.
అన్నమయ్య జిల్లా తంబాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ కి కాదని పారిశ్రామికవేత్త జయచంద్ర రెడ్డికి టికెట్ కేటాయించారు. టికెట్ కేటాయింపు తర్వాత పార్టీ కార్యక్రమాలు చురుగ్గా చేసుకుంటున్న సమయంలో సర్వేల్లో పేరు లేదని భావనతో టికెట్ మార్చాలని నిర్ణయించారు. టికెట్ ఎవరికి ఇస్తారు అన్నది ఇక్కడ ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతానికి ఈ టికెట్ రేసులో మదనపల్లి మాజీ ఎమ్మెల్యే దమ్మలపాటి రమేష్, జి శంకర్ యాదవ్, కొండ మురళి ఉన్నట్లు సమాచారం.
వీటితోపాటు మరో నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థులును మార్చాలని టిడిపి అధిష్టానం భావిస్తుంది. కడప జిల్లాలో కమలాపురం తిరుపతి జిల్లా వెంకటగిరిలో మార్పులు చేయాలని టిడిపి స్థానం భావిస్తోంది. అభ్యర్థుల మార్పుపైన 21వ తేదీ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆరోజు టిడిపి అభ్యర్థులకు బీ ఫారాలు అందజేయనున్నట్లు సమాచారం.