కడప జిల్లాలో బీజేపీ పోటీచేస్తున్న ఏకైక నియోజకవర్గం బద్వేల్. అసలు రెండు వేలు ఓట్లు కూడా లేని స్థానంలో చంద్రబాబు ఆటలో భాగంగా బీజేపీపోటిలో నిలిచింది. అయితే బీజేపీకి నియోజకవర్గంలో జెండా పట్టుకోవడానికి కార్యకర్తలు కూడా లేకపోవడం ఇక్కడ జనసేన పరిస్థితి కూడా అలానే ఉండడంతో చేసేదేమీ లేక టీడీపీ నాయకులు తమ కార్యకర్తలను కొన్ని రోజులు బీజేపీ కండువాలు కప్పుకొని ఎలక్షన్ ప్రచారానికి తిరగమని కోరుతుంటే ఆఖరికి జనసేన జెండా అయిన కప్పుకుంటాము గానీ బీజేపీ కండువా కప్పుకోలేమని మెజారిటీ కార్యకర్తలు తమ అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టారు. దీనితో వారిని బుజ్జగించి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జా రోషన్ కూడా మొన్నటి వరకు మన టీడీపీ వాడే కానీ బీజేపీలో టికెట్ కేటాయించారని సర్ధిచెబుతూ టీడీపీ కార్యకర్తలలకు బీజేపీ కండువాలు కప్పుతూ వైసీపీ నుండి వలసలు అని ప్రచారం మొదలు పెట్టారు.
గతంలో బద్వేల్ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. 2004లో వైఎస్ఆర్ హయం మొదలైన తరువాత ఆ నియోజకవర్గం మీద తమ పట్టును కోల్పోయి ఇప్పుడు చంద్రబాబు ఆలోచనలతో తమ ఉనికి కోల్పోయే పరిస్థితికి వచ్చింది. 2004 నుండి టీడీపీ గెలవడం లేదు అందులో 2019లో 45 వేల తేడాతో ఓడిపోయింది. 2021 బై ఎలక్షన్లో వైసీపీ 90వేల భారీ మెజార్టీతో విజయం సాధించింది. దీనితో తమకు మరొకసారి ఓటమీ తప్పదని భావించిన టీడీపీ అధినేత చంద్రబాబు లోకల్ గా టీడీపీకి పెద్ద దిక్కు అయిన విజయమ్మతో చర్చించి ఆ టికెట్ ను బీజేపీకి కేటాయించారు. ఇక్కడ విజయమ్మ నియోజకవర్గం మీద తమ కుటుంబం పట్టు కోల్పోవద్దని తమ అనుచరుడు బొజ్జా రోషన్ ను బీజేపీలోకి పంపి టికెట్ ఇప్పించుకున్నారు.
ఇప్పుడు ఇక్కడ బీజేపీకి టికెట్ ఇవ్వడంతో టీడీపీకి వున్న సంస్థాగత ఓటు బ్యాంక్ చెల్లాచెదురు అయిపోయింది. ఉన్న క్యాడర్ ను పరువు కోసం కప్పగంతులు మాదిరి అటూ నుండి ఇటు వారే బీజేపీలోకి పంపిస్తూ వారిని వైసీపీ వారిగా ప్రచారం చేస్తున్న తీరుతో ప్రజలు నవ్వుకుంటున్నారు.