ఎల్లో మీడియాకు కళ్లు, చెవులు, నోరు బాగా పనిచేస్తాయి. కాకపోతే వాటిని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్రెడ్డివ్యతిరేకంగా మాత్రమే వినియోగిస్తుంది. చేసిన మంచిని చూపించడానికి, ప్రజలకు చెప్పడానికి ఆ గ్యాంగ్ ఇష్టపడదు. కనీసం వినాలని కూడా అనుకోదు. ఏపీలో 2019 జూన్ నుంచి పారిశ్రామిభివృద్ధి బాగున్నా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పచ్చమీడియా నిత్యం దుష్ప్రచారం చేస్తోంది. అయితే యాడ్స్ కోసం కంపెనీల గురించి వార్తలు రాస్తుంది. ఇందులో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని చూపించాలని ప్రయత్నిస్తుంది.
శ్రీసిటీ సెజ్ కర్త, కర్మ, క్రియ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డే. ఆయన వల్లే వందలాది పెద్ద కంపెనీలు వచ్చాయి. వేలమంది ఉపాధి పొందుతున్నారు. 2014లో సీఎం అయిన చంద్రబాబు బిల్డప్ ఇవ్వడం తప్ప చేసిందేమీ లేదు. మళ్లీ 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక శ్రీసిటీకి మహర్దశ పట్టింది. అనేక కొత్త కంపెనీలు వచ్చాయి.
ఏసీలు, ఇతర కూలింగ్ ఉత్పత్తులు అందించే బ్లూస్టార్ లిమిటెడ్ ప్రభుత్వ సహకారంతో శ్రీసిటీలోని ప్లాంట్ను విస్తరించేందుకు చర్యలు తీసుకుంది. ప్రస్తుతం దీనికి ప్రతి సంవత్సరం మూడు లక్షల యూనిట్లు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. దీనిని రెట్టింపు చేసేందుకు యూనిట్ వద్ద అదనంగా 40 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. వచ్చే మూడు సంవత్సరాల్లో కొత్త దానిని ఆవిష్కరించేందుకు చర్యలు తీసుకున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బి.త్యాగరాజన్ వెల్లడించారు. ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.450 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు బ్లూస్టార్ డీప్ ఫ్రీజర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో తెలిపారు.
కొద్దిరోజుల క్రితమే గుంటూరు జిల్లా దాచేపల్లి వద్ద శ్రీ సిమెంట్ లిమెటెడ్ రూ.2,500 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ను ప్రారంభించింది. రామాయపట్నం వద్ద ఇండోసోల్ ఉత్పత్తులను మొదలుపెట్టింది. తాజాగా విస్తరణ పనులకు బ్లూస్టార్ కంపెనీ శ్రీకారం చుట్టింది. ఇవన్నీ జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితమే. కానీ దీనికి ఎల్లో గ్యాంగ్ అంగీకరించదు. అయినా ప్రజలకు పూర్తి విషయాలు తెలుసు.