ఉండవల్లిలో చంద్రబాబుతో భేటీ అనంతరం దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైయస్సార్ గారు ముస్లిం సమాజానికి అందించిన రిజర్వేషన్లను రద్దు చేస్తాం అంటూ కేంద్ర మంత్రులు ప్రకటన చేయడం చూస్తే ముస్లిం సమాజానికి చంద్రబాబు బీజేపీ పంచన చేరి వెన్నుపోటు పొడవటానికి సిద్దమయ్యాడని అర్ధమవుతుంది. చంద్రబాబుతో భేటీ అనంతరం కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ విలేఖరులతో మాట్లాడుతూ తాము ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకమని గోయల్ తేల్చి చెప్పారు.
టీడీపీ, బీజేపీ, జనసేనల ఉమ్మడి కార్యాచరణపై అలాగే ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చలు జరుపటానికి వచ్చిన బీజేపీ పెద్దలు చంద్రబాబుతో సుమారుగా గంట సేపు జరిపిన భేటి తరువాత ఇటువంటి ప్రకటన ఏపీలోనే చేయడం చూస్తే రాష్ట్రంలో ముస్లింస్ రిజర్వేషన్ రద్దుకు చంద్రబాబు మద్దతు కూడా సంపూర్ణంగానే ఉందని స్పష్టం అయిపోయింది , ఇన్నిరోజులు ఎన్నికల సభల్లో ముస్లింస్ కి టీడీపీ అండగా ఉంటుంది అని చెప్పిన ప్రతి మాట బూటకమే అని తేలిపోయింది.
చంద్రబాబు పూర్తిగా ముసుగు తీసేసి ముస్లింస్ బ్రతుకు పై దెబ్బ కొట్టేందుకు బీజేపీతో కలిసి కుట్రకు తెరలేపారని ఇదంతా తన మీద తన కొడుకు మీద ఉన్న అవినీతి కేసులు తొలగించుకోవడానికే బీజేపీ పంచన చేరి చేస్తున్న కుట్రగా తాము భావిస్తునట్టు రాష్ట్రంలో ముస్లిం పెద్దల నుండి వస్తున్న మాట. చంద్రబాబు బుద్ది మొదటి నుండి మైనారిటీలకి వ్యతిరేకమేనని మైనారిటీలకి వైయస్సార్ గారు పోరాడి రిజర్వేషన్లు తెస్తే చంద్రబాబు తన స్వార్ధం కోసం వాటిని తొలగించే కుట్ర చేస్తున్నారని ముస్లిం పెద్దలు తీవ్రంగా మండిపడుతున్నారు.