అయితే చిన్న పిల్లలపై తీసిన వీడియోపై రాజకీయమా? పిల్లలు ప్రేమ చూపించడం నేరమా??? అంటే కాదు కానే కాదు అనే చెప్పాలి. నిజంగా పిల్లలకు భువనేశ్వరిపై అభిమానం ఉండి ఉండవచ్చు.
నిజం గెలవాలి అని యాత్ర చేస్తున్న నారా భువనేశ్వరి నిన్న పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధినీ విద్యార్ధులను కలిసి ముచ్చటించారు. అలా కలవడాన్ని వీడియో తీసుకుని ఆపై ఆత్మీయత, అనురాగం, అమ్మతనం, అభిమానం అంటూ రకరకాలుగా హృదయాన్ని ద్రవింపచేసేలా వీడియోపై వాఖ్యలను కూడా జతచేసి టీడీపీ అఫిషియల్ పేజీలో పెట్టారు కూడా.”అమ్మపై ఎనలేని ప్రేమను చాటుకున్న పసి హృదయాలు”, “ఏ చోటకు వెళ్ళినా అమ్మపై అదే ప్రేమ, ఆప్యాయత” అంటూ చిన్నారులు భువనేశ్వరిపై కురిపించిన అభిమానాన్ని చాకచక్యంగా వీడియోల్లో బంధించారు కూడా.
అయితే చిన్న పిల్లలపై తీసిన వీడియోపై రాజకీయమా? పిల్లలు ప్రేమ చూపించడం నేరమా??? అంటే కాదు కానే కాదు అనే చెప్పాలి. నిజంగా పిల్లలకు భువనేశ్వరిపై అభిమానం ఉండి ఉండవచ్చు. పోని వారి తల్లిదండ్రులు టీడీపీ వారు అయ్యి ఉండవచ్చు కూడా. ఈ వార్త రాయడంలో.. పసి వారికి రాజకీయం అంటగట్టెందుకు ఎటువంటి ప్రయత్నమూ లేదు.
అయితే భువనేశ్వరి గారు గమనించారో లేదో కానీ భువనేశ్వరి గారితో పాటు ప్రపంచం మొత్తం తరచి చూడవలసిన విషయం… ఆ విద్యార్థులందరూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలు. అత్యంత కన్నులపండువగా ఉన్న వారి ఆహార్యం, పరిశుభ్రమైన దుస్తులతో కొత్త అనే బెరుకు లేకుండా వారు ఆత్మవిశ్వాసంతో నడుచుకున్న తీరు ఇటువంటివి పద్నాలుగేళ్ల తన భర్త పాలనలో ఎప్పుడైనా చూసారా, అలాంటి మంచి అనుభూతి కలిగిందా అన్న విషయం భువనేశ్వరి గారు గమనించి ఉంటే నాటికి నేటికి తేడా సుస్పష్టంగా అర్ధమయ్యి ఉండేది.
ప్రభుత్వ పాఠశాలలకి వచ్చే పేద పిల్లలకు శుభ్రమైన బట్ట, కాళ్ళకి బూట్లు, అందమైన బ్యాగులు అనేవి ఎందుకు తన భర్త చంద్రబాబు తన పాలనలో ఇవ్వలేకపోయారు, ప్రయివేటు పాఠశాలల విద్యార్థులతో సమానంగా ఆత్మవిశ్వాసంతో నడుచుకొనేలా తన భర్త హయాంలో పసి పిల్లల్ని ఎందుకు తీర్చిదిద్దలేకపోయారు అనే అంశం అసలు ఆవిడ ఆలోచనలోకి అయినా వస్తుందా? వస్తే ఇంటికెళ్ళి తన భర్తను నిలదీసి అడగగలరా? అసలు ఈ ప్రభుత్వ పాఠశాలలో వచ్చిన ఈ మార్పుని ఆవిడ గమనించారా అనే విషయం మనం నిజంగా ఆలోచించవలసిన విషయం.
నాడు నేడు, అమ్మ ఒడి, విద్యా దీవెన అంటూ ఎన్నో అద్భుతమైన పధకాలను తెచ్చి, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల రూపురేఖలను మార్చి, ప్రజలను ప్రభుత్వ పాఠశాలలవైపు రప్పించిన మొనగాడు జగన్ అని భువనేశ్వరి చంద్రబాబుకి చెప్పగలరా? చెప్తే విజనరీ బాబు తీసుకోగలరా??