నేను రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేస్తానని కొడుకు.. వద్దే వద్దు.. నువ్వు పోటీ చేస్తున్న నియోజకవర్గం సంగతి చూసుకో చాలని తండ్రి. ఇలా మొదలైన సమరంలో చివరికి కొడుకు మాటే నెగ్గింది. తప్పని పరిస్థితుల్లో తండ్రి తలొగ్గాల్సి వచ్చింది. వారిద్దరే చంద్రబాబు నాయుడు, లోకేశ్. తనను జూలో బంధించేశారని ఇంతకాలం బాధపడుతూ వచ్చిన చినబాబు ఎట్టకేలకు జనంలోకి వస్తున్నాడు.
చంద్రబాబు.. పవన్ కళ్యాణ్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వడాన్ని లోకేశ్ చాలాకాలంగా సహించలేకపోతున్నాడు. జస్ట్ సపోర్టు తీసుకోమని చెబితే నెత్తిన పెట్టుకుని తిప్పుకొంటున్నాడని తండ్రిపై కోపంగా ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రచారం చేయడానికి బాబు అంగీకరించలేదు. మంగళగిరిలో సర్వే చేయిస్తే టీడీపీ ఓటమి ఖాయమని నివేదిక వచ్చిందని, అక్కడే తిరగాలని ఆదేశించాడు. దీంతో తండ్రీకొడుకుల మధ్య విభేదాలు ముదిరాయి. పైకి మాట్లాడుకుంటున్నట్లు నటిస్తున్నారు. లోకేశ్ అయితే తన సన్నిహితుల వద్ద బాబును అనరాని మాటలు అంటున్నాడని తెలుగు తమ్ముళ్లు ప్రచారం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో చినబాబు తాను పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ప్రచారాన్ని గాలికొదిలేశాడు. నేరుగా వెళ్లి నామినేషన్ కూడా వేయలేదు. నాయకులతో వేయించాడు. హైదరాబాద్‌కే ఎక్కువగా పరిమితమయ్యాడు. అప్పుడప్పుడు మాత్రం వచ్చి మొక్కుబడిగా తిరిగాడు. భార్య బ్రహ్మణికి బాధ్యతలు అప్పజెప్పగా ఆమె పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు. లోకేశ్‌పై బాబుకు ఏ మాత్రం నమ్మకం లేదు. అతనికి మాట్లాడడం చేతకాదని, ఓట్లు పడకుండా చేస్తాడని ఇంతకాలం వేరే నియోజకవర్గాల్లో ప్రచారం చేయనీయకుండా ఆపాడు.
పోలింగ్ తేదీ దగ్గర పడే కొద్దీ ఇంట్లో విభేదాలు ఎక్కువై లోకేశ్ తనకేం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తుండడంతో చంద్రబాబు పుత్రవాత్సల్యంతో తలొగ్గక తప్పలేదు. దీంతో చినబాబు తన షెడ్యూల్‌ను తయారు చేయించుకున్నాడు. మంగళవారం నుంచి వచ్చే మార్చి 6వ తేదీ వరకు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పర్యటించనున్నారు. తొలిరోజు ఒంగోలు, 1న నెల్లూరు, 2న రాజంపేట, 3న కర్నూలు, 4న నంద్యాల, 5న చిత్తూరు, 6న ఏలూరు పార్లమెంట్ పరిధిలో కార్యక్రమాలు జరుగుతాయి. పాపం తెలుగు తమ్ముళ్లు.. చినబాబు స్పీచ్‌ల నుంచి తప్పించుకోవడానికి ఎన్ని పాట్లు పడాలో..