బీసీల పుట్టినిల్లు టీడీపీ, బీసీల ఆత్మగౌరవం నిలబెట్టిన పార్టీ టీడీపీ అని చెప్పుకొనే చంద్రబాబు చేతిలో నలిగిపోయిన బీసీ నాయకుల చిట్టా చూస్తే చేంతాడు అంత ఉంటుంది. ఎప్పుడూ సొంత పార్టీలోని బీసీలకు వెన్నుపోటు పొడిచే బాబు ఈసారి పక్క పార్టీల నుండీ గేలం వేసి మరీ వెన్నుపోటు పొడిచాడు. వారిలో ప్రధానంగా వైసిపి నుంచీ లాక్కున్న జంగా కృష్ణ మూర్తి, గుమ్మనూరు జయరామ్ ల పరిస్థితి మరీ దారుణం అని చెప్పొచ్చు.
జంగా కృష్ణ మూర్తి 1999 లో మొదటిసారి ఎమ్మెల్యే గా గురజాల నియోజకవర్గం నుండి గెలిపొందిన ఆయన, 2004 లో మరోసారి ఎన్నికయ్యారు. కాగా 2009 లో కాంగ్రెస్ నుండి, 2014 లో వైసీపీ నుండి వరసగా రెండుసార్లు ఓటమిపాలయ్యాడు.. 2014 లో ఓటమి చెందినా జగన్ మోహన్ రెడ్డి ఆయనకు ఎంఎల్సీ ఇచ్చి, వైసీపీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడిగా నియమించి ఆయనకు తగిన గౌరవం ఇచ్చాడు. 2019 లో గురజాల నుండీ గెలిచిన కాసు మహేష్ ని కాదని 24 ఎన్నికలకి తనకి సీటు ఇమ్మని డిమాండ్ చేసిన జంగా వైసీపీ నిర్ణయం ప్రకటించక ముందే బీసీలకు వైసీపీలో గౌరవం లేదని పార్టీని వీడి టీడీపీతో చర్చల్లో మునిగితేలాడు. తొలుత పల్నాడు జిల్లాలో ఒక బీసీ యాదవకి టికెట్ ఇస్తాం అది నీకే అని ఊరించిన బాబు చివరికి మొండి చెయ్యి చూపేసరికి ఎటూ పాలుపోని స్థితిలో చిక్కుకున్నాడు జంగా.
మరో బీసీ నేత గుమ్మనూరు జయరామ్, బోయ సామాజిక వర్గానికి చెందిన జయరామ్ కి వైసీపీ నుండీ రెండు సార్లు ఎమ్మెల్యే టికెట్, ఒకసారి మంత్రి పదవి ఇచ్చిన జగన్ 24 ఎన్నికలకు ఎంపీగా పోటీ చేయమనడంతో వైసీపీని వీడి టీడీపీలో చేరి చంద్రబాబు కాళ్ళకి మొక్కినా ఫలితం లేకపోయింది. మొదట గుంతకల్లు ఇస్తానని చెప్పి టీడీపీలో చేర్చుకొన్న బాబు ఇప్పుడు అది వేరేవాళ్లకి ఇవ్వడం, కనీసం ఆలూరు అయినా ఇమ్మని అడుగుతున్నా స్పందన లేకపోవడంతో ఉన్నది పోయింది ఉంచుకొన్నది పోయింది అని తల పట్టుకోవటం గుమ్మనూరు వంతు అయ్యింది.
ఎన్నికల నాటికి ఇంకెంత మంది బీసీలు బాబు ఖాతాలో బలి కానున్నారో.