చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన తరువాత వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలతో టీడీపీ పార్టీ విజయావకాశాలను తగ్గించుకుంటూ పోతున్నారు. తాజాగా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం లో మాట్లాడుతూ ఇక్కడ వ్యాపారులు చేసే దుకాణాల్లో గంజాయి విచ్చిల విడిగా దొరుకుతుంది అంటూ వ్యాపార వర్గమైన ఆర్యవైశ్యులను కించ పరిచేలా మాట్లాడారు. దీనితో ఆర్యవైశ్యులు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఎన్నికల నియమావళిని పాటిస్తూ రావులపాలెం బంద్ కు పిలుపునివ్వడమే కాకుండా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అ మాటలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తున్నరు.
జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న టీడీపీ అభ్యర్థులు చంద్రబాబు నాయుడుకు ఏమైంది గత కొద్దిరోజులుగా చేస్తున్నా వివాదాస్పద వ్యాఖ్యల వలన పార్టీకి మంచి జరగకపోగా ఈ వ్యాఖ్యలతో టీడీపీకి పోటీలో వున్న అభ్యర్థులకు తీవ్ర నష్టం జరుగుతుంది అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదట శింగనమలలో టిప్పర్ డ్రైవర్లు అంటూ అవహేళనగా మాట్లాడిన మాటలతో ఇప్పటికే అ వర్గం మరియు దళితులు టీడీపీ కి దూరం జరిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. వెంటనే వాలంటీర్ల వ్యవస్థ మీద ఎలక్షన్ కమిషన్ కు చేసిన ఫిర్యాదుతో 66 లక్షల మంది ఫించన్ దారులు ఈరోజు టీడీపీ పార్టీని బండ బూతులు తిడుతూ ప్రచారానికి గడపకూడ తొక్కనియ్యడం లేదు . ఇప్పుడు తాజాగా రాష్ట్రంలో వ్యాపార వర్గమైన ఆర్యవైశ్యులను గంజాయి అమ్ముతున్నారు అంటూ ఆ వర్గాలను కించ పరుస్తూ మాట్లాడిన మాటలతో రాష్ట్రంలో బలమైన ఆర్థిక వర్గాన్ని పార్టీకి దూరం చెయ్యడమే అని చంద్రబాబు నాయుడు మీద ఆందోళనతో వున్నారు.
చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ వ్యాఖ్యలతో టీడీపీ నేతలు తమ నియోజకవర్గంలో బాబూ పర్యటన లేకుండా వుంటే బాగుండు అని కోరుకుంటున్నారు . బాబు పర్యటనతో మంచి ఏమో గానీ ఏదైనా వ్యాఖ్యలు చెస్తే తమ పుట్టి మునగటం ఖాయం అని టీడీపీ నేతలు మాట్లాడుకుంటున్నారు.