భారత దేశానికి స్వాతంత్రయం వచ్చిన తరువాత దేశ పునర్నిర్మాణం కోసం, సామాజిక న్యాయం కోసం, రాజకీయ ప్రక్రియలో బడుగు, బలహీన వర్గాలకు న్యాయమైన వాటా కోసం రచించిన వ్యూహాలపై, నిర్దేశించిన విధానాలపై చెరగని ముద్రవేసిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్. ఈ దేశానికి ఒక సమగ్రమైన రాజ్యాంగాన్ని అందించిన మహానుభావుడు కూడా ఆయనే. కానీ ప్రతీ ఏటా ఆయన జయంతులు వర్ధంతులు జరిపే రాజకీయ పార్టీలు మాత్రం ఆయన ఆశయాలను సాధించడంలో, సామాజిక న్యాయం అందించడంలో, రాజకీయాల్లో బలహీన వర్గాలకి న్యాయమైన వాట అందించడంలో విఫలం చెందాయనే చెప్పాలి.
నవభారత నిర్మాత అంబేద్కర్ గారు ఈ లోకం వదిలి దశాబ్ధాలు కావస్తున్నా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన ఆశయాలను అనుసరిస్తూ పాలించిన పార్టీ ఒక్కటి కూడా లేదు. మొదటి సారిగా ఆ మహనీయుడి ఆలోచనలను అందిపుచ్చుకుని పాలన సాగిస్తున్న పార్టీ జగన్ గారి ఆద్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీనే అని చెప్పడంలో అతిశయొక్తి కాదు. ప్రతిపక్ష నేతగా సుదీర్ఘ పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన జగన్ గారు వచ్చి రాగానే అంబేద్కర్ ఆశయాలకి అనుగుణంగా పాలన మొదలుపెట్టారు.
ప్రజల గడపవద్దకే పాలన అందించే విదంగా ఏర్పాటు చేసిన వ్యవస్థ వలంటీర్లలో దాదాపు 83 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, పేదవర్గాల వారికే అవకాశం కల్పించారు, అలాగే వలంటీర్లకు తోడుగా 1.40 లక్షలకు పైగా గ్రామ, వార్డు సచివాలయాల్లో దాదాపుగా 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన వారికే కేటాయించి వారి అభ్యుదయానికి అధికారంలోకి రాగానే తొలి అడుగు వేశారు.
అధికారంలోకి రాగానే 25 మందితో ఏర్పాటైన కేబినెట్లో గతంలో ఏ పాలకుడు చేయని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన 14 మందికి (56 శాతం) స్థానం కల్పించారు. ఐదుగురు డిప్యూటీ సీఎంలలో నలుగురిని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల నుంచే తీసుకున్నారు. 2022 ఏప్రిల్ 11న పునర్ వ్యవస్థీకరణ ద్వారా 25 మందితో ఏర్పాటు చేసిన మంత్రి వర్గంలో సామాజిక న్యాయంలో జగన్ మరో అడుగు ముందుకేశారు, ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి ఏకంగా 17 మందికి (70 శాతం) మంత్రి వర్గంలో స్థానం కల్పించారు. అలాగే శాసన మండలిలో వైఎస్ఆర్ సీపీకి 43 మంది ఎమ్మెల్సీలు ఉండగా వీరిలో 29 మంది (68 శాతం) బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారే అవకాశం కల్పించారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చారిత్రక చట్టం చేసి సీఎం జగన్ పదవులు ఇచ్చారు. ఇలా రాజకీయంగా పంచాయతీల దగ్గర నుండి పెద్దల సభ వరకు వారికి పెద్దపీట వేసి రాజకీయ ప్రక్రియలో బడుగు, బలహీన వర్గాలకు న్యాయమైన వాటాకి శ్రీకారం చుట్టారు.
అలాగే సామాజిక న్యాయం పాటిస్తూ ఎక్కడా వివక్ష చూపకుండా పేదలకి సంక్షేమ పథకాల ద్వారా డీబీటీతో పేదల ఖాతాల్లోకి 2.46 లక్షల కోట్లు జమచేశారు. ఇందులో 75 శాతం నిధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఖాతాల్లోకే వెళ్ళాయనేది గణాంకాలు చెబుతున్న మాట. అలాగే నగదు బదిలీయేతర పథకాల ద్వారా పేదలకు మరో 1.67 లక్షల కోట్లు అందించిన ఘనత జగన్ గారికే దక్కుతుంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాలను అందిపుచ్చుకున్న జగన్ వాటిని పూర్తి స్థాయిలో అమలు చేసి పేదల పక్షపాతిగా తనదైన ముద్ర వేసుకున్నారు. కాబట్టే పేదల గుండెల్లో బలమైన స్థానం ఏర్పర్చుకున్నారు జగన్.