మాజీ ఇండియన్ క్రికెటర్ అంబటి రాయుడు మరోసారి తను నిలకడలేనితనాన్ని బయటపెట్టాడు. 2024 సార్వత్రిక ఎన్నికలలో జనసేన తరఫున స్టార్ క్యాంపైనర్ లిస్టులో అంబటి రాయుడు మొదటి పేరుగా ఉంది , ఎన్నికలకు మూడు వారాలు కూడా లేని సందర్భంలో జనసేన తరఫున ఇప్పటివరకు ఎటువంటి ప్రచారంలో పాల్గొనలేదు. జనసేన స్టార్ క్యాంపెనర్ లిస్టులో మిగిలిన వారందరూ ఎంతో కొంత పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒక వెబ్సైట్ ఎందుకు ప్రచారంలో పాల్గొనలేదు అనే వార్త రాయగా దానికి అంబటి రాయుడు స్పందిస్తూ జనసేన తరుపున ప్రచారం చేయడానికి సరైన దిశా నిర్దేశం, ఒక ప్లానింగ్ లేదని . తనని ఎవరు సంప్రదించలేదని చెప్పుకుంటూ వచ్చారు. ఎటువంటి పిలుపు లేని ఎడల తాను జనసేన జెండా పట్టుకొని జై జనసేన అంటూ రోడ్ల పైన తిరగాలా అంటూ ట్విట్టర్ వేదిక పై సమాధానం ఇచ్చాడు. అలా సమాధానం ఇచ్చిన గంటలోపే ట్విట్టర్ నుంచి ట్వీట్ డిలీట్ చేశాడు.
2023లో అన్ని రకాల క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత గుంటూరు జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేశాడు. మొదట అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరకుండానే బయట నుంచి మద్దతు తెలుపుతూ ప్రభుత్వం చేసిన మంచి పనిని ప్రచారం చేస్తూ ముందుకు వెళ్తూ వచ్చాడు. అలా ఒక మూడు నెలలు తిరగగానే గుంటూరు ఎంపీ స్థానం ఆశించాడు. గుంటూరు ఎంపీ స్థానం అంబటి రాయుడుకి కేటాయించకపోవడంతో పార్టీలో చేరిన పది రోజులకే ఆ పార్టీని వీడి జనసేనలో చేరాడు. పవన్ కళ్యాణ్ ఆలోచనలు, తన ఆలోచనలు ఒకే రకంగా ఉంటాయని అందుకే జనసేనలో చేరుతున్నానని ప్రకటించాడు. జనసేనలో చేరిన 10 రోజులకి రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకొని ఒక నెలపాటు దుబాయిలో జరిగిన క్రికెట్ లీగ్ లో ఆడాడు. ఆ తర్వాత ఇండియాకు వచ్చిన రాయుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కామెంటేటర్ అవతారం ఎత్తాడు, తనకి రాజకీయాలకి సంబంధం లేనట్లు మూడు నెలలు వ్యవహరించారు. కానీ అనూహ్యంగా రాయుడు పేరును జనసేన స్టార్ క్యాంపెనర్స్ లిస్టులో ప్రకటించిన తర్వాత ఇప్పటివరకు ఒకరోజు కూడా జనసేన తరఫున ప్రచారం చేయకుండా ఐపీఎల్ లో కామెంట్రీ చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు. జనసేన తరపున ప్రచారం చేయనప్పుడు స్టార్ క్యాంపెనర్ గా ఎందుకు తన పేరు నమోదు చేసుకున్నారని జనసేన కార్యకర్తలు రాయుడు మీద మండిపడుతున్నారు. ఇలా అంబటి రాయుడు ఎక్కడ చేరినా తన నిలకడ లేని బయట పెట్టుకుంటూ వస్తున్నారు.