2024 సార్వత్రిక ఎన్నికలకు రెండు వారాల సమయం కూడా లేదు దీంతో ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ పార్టీ అధ్యక్షులు జోరుగా తమ ప్రచారాలను కొనసాగిస్తున్నారు. ఈరోజు ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మొదటి సభ ఉదయం 10 గంటలకు విజయనగరం లోక్‌సభ స్థానం పరిధిలోని బొబ్బిలిలో మెయిన్ రోడ్ సెంటర్లో, రెండో సభ మధ్యాహ్నం 12.30 గంటలకు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని పాయకరావుపేటలోని సూర్య మహల్ సెంటర్లో, మూడో సభ మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరులోని ఫైర్ స్టేషన్ సెంటర్లో జరిగే ప్రచార సభలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు హైదరాబాద్ నుంచి నేరుగా ప్రత్యేక హెలికాఫ్టర్ ద్వారా చీరాలకు చేరుకొని అక్కడ జరిగే ప్రజాగళం సభలో పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు నియోజకవర్గాల్లో రోడ్ షో పాల్గొని అనంతరం గుంటూరులో ప్రజాగళం సభలో ప్రసంగించనున్నారు. ప్రజగళం సభ ముగియగానే రాత్రికి తిరిగి హైదరబాద్ కి వెళ్లనున్నారు
జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఇవాళ ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఆ పార్టీ తరపున యలమంచిలిలో సుందరపు విజయకుమార్, పెందుర్తిలో పంచకర్ల రమేశ్‌బాబు, విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వంశీకృష్ణ శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. వారికి మద్దతుగా ఈ రోజు సాయంత్రం మూడు గంటలకు ఎలమంచిలి నియోజకవర్గ పరిధిలోని అచ్యుతాపురంలో జరిగే సభలో పాల్గొంటారు. ఆ తరువాత సాయంత్రం ఆరు గంటలకు పెందుర్తి జంక్షన్లో ఏర్పాటుచేసే సభలో ప్రసంగిస్తారు. రాత్రికి విశాఖపట్నం చేరుకొని విశ్రాంతి తీసుకుంటారు.