టీడీపీకి ఉత్తరాంధ్ర జిల్లాలు కంచుకోటలు అని అందరికి తెలిసిందే. అలాంటి చోట విజయనగరం జిల్లాలో చంద్రబాబు రాజకీయంతో ముగ్గురు సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు తమ ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. వారిలో మొదటి వ్యక్తి బొబ్బిలి రాజులు అయిన సుజయ్ కృష్ణ రంగారావు. బొబ్బిలి రాజులు మొదటి నుండి కాంగ్రెస్ తరువాత వైసీపీ లో జాయిన్ అయ్యి ఎంఎల్ఏ గా గెలిచారు. 2014 లో గెలిచిన తరువాత టీడీపీలో జాయిన్ అయ్యి మంత్రీగా కూడా పనిచేశారు. ఆ తరువాత 2019 లో టీడీపీ తరుపున బొబ్బిలిలో పోటీ చేసి ఓడిపోయారు. అలాగే వీరి తమ్ముడు బేబినాయన విజయనగరం ఎంపీ గా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఒక కుటుంబానికి ఒకటే టికెట్ పేరుతో ఒక్కరికే టికెట్ ఇస్తాం అనడంతో సుజయ్ కృష్ణ రంగారావు ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పి తన తమ్ముడు బేబినాయనకు అవకాశం కల్పించారు.
మరొక నాయకుడు విజయనగర టీడీపీని గత ముప్పై సంవత్సరాలుగా చక్రం తిప్పుతున్న అశోక్ గజపతి రాజు. 1978 జనతా పార్టీ నుండి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి తర్వాత టీడీపీలో జాయిన్ అయి ఇప్పటివరకు విజయనగరం జిల్లా టీడీపీ కి పెద్ద దిక్కుగా చక్రం తిప్పారు. ఇప్పటివరకు 8 సార్లు ఎంఎల్ఏ గా పోటి చేసి 7 సార్లు గెలిచారు కేవలం 2004 లో మాత్రమే ఎంఎల్ఏ గా ఓడిపోయారు. ఇక ఎంపీ గా రెండు సార్లు పోటీ చేశారు 2019 లో మాత్రమే ఒకసారి ఎంపీగా ఓడిపోయారు. 2019 లో విజయనగర అసెంబ్లీ కి తన వారసురాలుగా అదితిని తీసుకువచ్చారు కానీ తను ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. చంద్రబాబు ఈసారి ఒకటే టికెట్ ఇస్తాము అని చెప్పడంతో తన ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి చెప్పి తన కూతురికి విజయనగరం అసెంబ్లీ టికెట్ ఇప్పించుకున్నారు. విజయనగరంలో అశోక్ గజపతి రాజు తనకంటూ కొన్ని ప్రత్యేక పేజీలు లిఖించుకున్నారు.
ఇక విజయనగరం జిల్లాలో మరో కీలక రాజకీయ నేత అయిన పతివాడ నారాయణ స్వామీ తను కూడా ప్రత్యక్ష రాజకీయాలకు దూరం జరిగారు.మొదటిసారి 1983 లో టీడీపీ తరుపున భోగాపురం ఎంఎల్ఏ స్థానం నుంచి వరుసగా ఆరు సార్లు విజయం సాధించారు. 2009 లో కొత్తగా నెల్లిమర్ల నుండి పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి 2014 లో గెలిచి ప్రోటెం స్పీకర్ గా పని చేశారు. మళ్ళీ 2019 లో ఓడిపోయారు. ఇప్పుడు కూటమి పొత్తులో భాగంగా జనసేనకు టికెట్ కేటాయించడంతో ప్రత్యక్ష రాజకీయాలకు సెలవు చెప్పేసారు. ఇలా ముగ్గురు రాజకీయ ఉద్దండులు బాబు దెబ్బకు తమ రాజకీయా జీవితాన్ని ఆపేసారు.