ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పెద్దాపురంలో టీడీపీకి భారీ ఎదురు దెబ్బలు వరుసగా తగులుతున్నాయి. ఇప్పటికే జనసేన పార్టీకి టికెట్ దక్కలేదని జనసేన పార్టీ కార్యకర్తలు ప్రచారానికి దూరంగా వున్నారు. ఇప్పుడు పెద్దాపురం టీడీపీ కీలక నాయకులయిన తోట సుబ్బారావు, ముత్యాల శ్రీనివాస్, జనసేన గోపాల్ లు తమ పార్టీలకు రాజీనామా చేసి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో జాయిన్ అయ్యారు. తోట సుబ్బారావు తండ్రి కాకినాడ ఎంపీగా రెండు సార్లు పని చేశారు. పెద్దాపురం ఎమ్మెల్యేగా పని చేశారు. 2019 లో చినరాజప్ప గెలుపులో అత్యంత కీలకపాత్ర పోషించారు.
ఇప్పటికే పెద్దాపురం టీడీపీ టికెట్ కోసం గత సంవత్సర కాలంగా టీడీపీ పార్టీ రెండు గ్రూపులుగా విడిపోయి టికెట్ కోసం గొడవపడ్డారు. నిమ్మకాయల చినరాజప్ప నాన్ లోకల్ అతనిది అమలాపురం నియోజకవర్గం అని టీడీపీలోని మరో వర్గం అయిన వెంకటరమణ చౌదరి, గుణ్ణం చంద్రమౌళిల కలిసి ప్రచారం చెయ్యడమే కాకుండా చంద్రబాబు పెద్దాపురంకు వచ్చినప్పుడు చినరాజప్ప కు వ్యతరేకంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసి నినాదాలు చేశారు. చంద్రబాబు టికెట్ కోసం ఆశపడుతున్న కమ్మ సామాజిక వర్గ నేతలయిన వెంకటరమణ చౌదరి, గుణ్ణం చంద్రమౌళిలతో మాట్లాడటానికి ప్రయత్నాలు చెస్తే వెంకటరమణ చౌదరి మాత్రమే చంద్రబాబును కలిసి అసలు పెద్దాపురం నియోజకవర్గం టీడీపీ సీటు కమ్మ సామాజిక వర్గానిది కొన్ని సమీకరణాల వలన చిన్నరాజప్పకు ఇచ్చారు. ఇప్పుడు తిరిగి కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలి. ఒకవేళ నాకు ఇవ్వలేని పక్షంలో గుణ్ణం చంద్రమౌళికి అయిన ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ గుణ్ణం చంద్రమౌళి లోకేష్ కి అత్యంత ఆప్తుడు కావడం గమనార్హం.
దీని మీద చంద్రబాబు, గుణ్ణం చంద్రమౌళితో మాట్లాడటానికి ప్రయత్నాలు చేసిన అందుబాటులోకి రాకపోవడంతో ఈ సమస్యను ప్రత్తిపాటి పుల్లారావుకి అప్పగించారు. పుల్లారావు కమ్మ సామాజిక వర్గ నేతలయిన వెంకటరమణ చౌదరి, గుణ్ణం చంద్రమౌళితో మాట్లాడి ప్రస్తుతానికి సమస్యను సర్దుబాటు చేశారు. వీరిద్దరు ఎంతవరకు చినరాజప్పకు సపోర్ట్ చేస్తారో చూడాలి. అంతే కాకుండా చినరాజప్ప వరుసగా రెండుసార్లు గెలిచిన పెద్దాపురంకు ఏమి చెయ్యలేదని పూర్తి స్థాయిలో వ్యతిరేకత వుంది. ఈ సారి పెద్దాపురంలో టీడీపీలోని గ్రూపులు కలిసి పని చేస్తారో లేదో అని వేచి చూడాలి.