వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో కూటమి కట్టి పోటీ చేయాలని చూస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మరోవైపు కాంగ్రెస్ పార్టీతో అనుబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. 2024లో అధికారం తెచ్చుకోవడమే పరమావధిగా ఆయన రాజకీయాలు, కుట్రలు సాగుతున్నాయి. అందులో భాగంగా ప్రతి పార్టీని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలికి తన బంధువు పురందేశ్వరిని నియమించేలా చక్రం తిప్పారు. కమ్యూనిస్ట్ నాయకుల్ని గుప్పిట్లో పెట్టుకుని ప్రభుత్వాన్ని ఇష్టానుసారం తిట్టిస్తున్నారు. ఇక జనసేన అధినేత పవన్ […]
‘నాకు చెల్లెలంటే ప్రాణం. తను ఆనందంగా ఉంటే చాలు..’ కొన్నేళ్ల క్రితం ఓ ఇంగ్లిష్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన మాటలివి. కానీ అదే చెల్లెలు నేడు ప్రత్యర్థుల భుజాలపై నుంచి అన్నపై బాణాలు వేస్తోంది. షర్మిల.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె. బ్రదర్ అనిల్ కుమార్ భార్య. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టి హడావుడి చేసిన ఆమె ఇప్పుడు ఏకంగా ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టింది. ఆమె మాటలు, వ్యవహరిస్తున్న తీరు […]
YS ఆశయాలను జగన్ అమలు చేయడం లేదని షర్మిళ మైకు ముందుకొచ్చిన ప్రతిసారీ పాపం గొంతు చించుకుంటున్నారు. నిజానికి వై.యస్ ఆశయాలను ఆయన చనిపోయిన తర్వాత ఏ పార్టీ కూడా పట్టించుకోలేదు, ఒక్క జగన్ తప్ప. ఆయన చనిపోయాక ఆయన ఫొటోనే తీసి పక్కన పడేసిన కాంగ్రెస్, ఇంక ఆయన ఆశయాలను అమలుచేసే ఉద్దేశ్యాన్ని కూడా ఏ రోజు చూపించలేదు. తర్వాత ప్రజలే కాంగ్రెస్ వైపు చూడటం మానేసారు. ఇంక, చంద్రబాబు అయితే తర్వాత అధికారంలోకి వచ్చాక […]
ఎవరో నిన్ను ముంచడానికి నీ చేతికొక కుక్క తోక అందిస్తే దాన్ని పట్టుకుని రాజకీయ గోదారి ఈదటానికి సిద్ధ పడి చేజేతులా నీ రాజకీయ భవితవ్యాన్ని నాశనం చేసుకోడానికి దిగావు. సరే, ఆ విషయం గ్రహించకుండా కుటుంబాల చీలిక గురించి ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావమ్మా? నలుగురూ నవ్వి పోతారనైనా లేదే? నీ వ్యక్తిగత విభేదాలను సాకుగా చూపి ప్రజల జీవితాలతో ఆడుకోడానికి రాజకీయ పార్టీ పెడతావా? నీ కుటుంబంలో, నీ సొంత అన్నతో నీకు ఆర్థికంగానో, రాజకీయంగానో […]
ఒకప్పుడు దేశాన్నే శాసించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దేశంలో తన ఉనికి చాటుకోవడానికి ప్రాంతీయ పార్టీలతో కూటమి కట్టే స్థాయికి పడిపోయింది. బీజేపీని గద్దె దించాలనే ఏకైక లక్ష్యంతో ఏర్పాటైన ఇండియా కూటమి ప్రస్తుతం ఇసుక తక్కెడ పేడ తక్కెడగా మారిపోయింది. ఒక్కో పార్టీని, ఒక్కో నాయకులను కలుపుకుని కూటమి కట్టిన కాంగ్రెస్ పార్టీకి మరోవైపు ఆ నాయకులు కూటమి నుండి జారుకోవడం షాకిచ్చే అంశమనే చెప్పాలి. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మమతా బెనర్జీ […]
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ డర్టీ గేమ్ ఆడుతూ ఉంటుందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం తిరుపతిలో జరిగిన ఇండియూ టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ పలు ప్రశ్నలు అడగ్గా సీఎం సమాధానాలిచ్చారు. ఓ ప్రశ్నకు ఇలా స్పందించారు. కాంగ్రెస్‌ది డర్టీ గేమ్ అంటూ ఎండగట్టారు. అది ఆ పార్టీ సంప్రదాయంగా వస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను అన్యాయంగా విభజించారని మండిపడ్డారు. వాళ్లు విభజించి పాలించాలనుకున్నారని చెప్పారు. ఇప్పుడు మా […]
నిన్న షర్మిళ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు చేతిలోకి తీసుకున్న సందర్భంలో చేసిన ప్రసంగం పక్కా డిల్లీ పెద్దల నుండి వచ్చిన నియమ నిబంధనలకి అనుగుణంగా సాగినట్టు అనిపించింది. తన ప్రసంగంలో ఆంధ్ర నాయకులందరినీ తలొక మాట అన్నా షర్మిళ, జగన్ విషయంలో మాత్రం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే… అసలు ఆవిడ ఇన్నాళ్ళు ఇన్ని విషయాలపై ఎలా మౌనంగా ఉన్నారన్నది అతి పెద్ద ప్రశ్నగా ప్రజలకి ఎదురయింది. ఈ ప్రభుత్వం ఇన్నేసి కోట్ల అప్పులు చేసిందని, మైనింగ్, […]
చంద్రబాబు పన్నిన కుట్రలో చిక్కుకుని సీఎం జగన్ సోదరి షర్మిల పావుగా మారారని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేటలో ఆదివారం వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ షర్మిల వ్యవహరిస్తున్న తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ అన్ని పార్టీలను పొత్తులతో కలుపుకుంటూ కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి ఓట్లను […]
నిన్న కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ప్రమాణస్వీకారం సందర్భంగా షర్మిల వై.యస్ జగన్ పై పలు విమర్శలు చేసిన నేపధ్యంలో, అసలు ఆ విమర్శలలో నిజం లేదంటూ సజ్జల అన్నారు. ఏపీలో ఉనికి లేని పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి, వైఎస్సార్ కుటుంబానికి అన్యాయం చేసిందన్నారు. అంతే కాక ఆయన షర్మిళను సూటిగా కొన్ని ప్రశ్నలు అడిగారు. అసలు కాంగ్రెస్ పార్టీ గురించి షర్మిలకు ఏం తెలుసు? తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిళ అక్కడి నుంచి […]
స్పష్టమైన ఆలోచన, స్థిరమైన కార్యాచరణ, నిబద్దతతో కూడిన నిర్ణయాలు లేకుండా తొందరపాటు చర్యలతో రాజకీయ నాయకులు ఎలా విఫలమవుతారో అనటానికి ఒక ఉదాహరణ వై ఎస్ షర్మిల . వైఎస్సార్ అకాలమరణం తర్వాత ఓదార్పు యాత్ర పై కాంగ్రెస్ అధిష్టానంతో విభేడించి బయటకి వచ్చిన జగన్ సొంత పార్టీ పెట్టిన నాడు జగన్ తో ఉన్నారు షర్మిల . కాంగ్రెస్ ని వీడిన ఫలితంగా పలు అక్రమ కేసుల్లో ఇరుక్కుని జగన్ జైలు పాలయ్యిన సందర్భంలో జగన్ […]