కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ డర్టీ గేమ్ ఆడుతూ ఉంటుందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం తిరుపతిలో జరిగిన ఇండియూ టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ పలు ప్రశ్నలు అడగ్గా సీఎం సమాధానాలిచ్చారు. ఓ ప్రశ్నకు ఇలా స్పందించారు. కాంగ్రెస్‌ది డర్టీ గేమ్ అంటూ ఎండగట్టారు. అది ఆ పార్టీ సంప్రదాయంగా వస్తోందన్నారు.
ఆంధ్రప్రదేశ్‌ను అన్యాయంగా విభజించారని మండిపడ్డారు. వాళ్లు విభజించి పాలించాలనుకున్నారని చెప్పారు. ఇప్పుడు మా కుటుంబాన్ని కూడా విభజించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను కాంగ్రెస్ నుంచి విడిపోయినప్పుడు చిన్నాన్నకు మంత్రి పదవి ఇచ్చారని, తమపై పోటీకి పెట్టారని తెలిపారు. కాంగ్రెస్ ఇంకా పాఠాలు నేర్వలేదన్నారు. నా చెల్లి షర్మిలకు ఏపీ బాధ్యతలు అప్పగించారని, అధికారం దేవుడు ఇచ్చేదని జగన్ కుండబద్ధలు కొట్టారు. దేవుడ్ని బలంగా నమ్ముతానని, ఆయనే అన్ని చూస్తాడని సీఎం వెల్లడించారు.