నిన్న షర్మిళ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు చేతిలోకి తీసుకున్న సందర్భంలో చేసిన ప్రసంగం పక్కా డిల్లీ పెద్దల నుండి వచ్చిన నియమ నిబంధనలకి అనుగుణంగా సాగినట్టు అనిపించింది. తన ప్రసంగంలో ఆంధ్ర నాయకులందరినీ తలొక మాట అన్నా షర్మిళ, జగన్ విషయంలో మాత్రం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే… అసలు ఆవిడ ఇన్నాళ్ళు ఇన్ని విషయాలపై ఎలా మౌనంగా ఉన్నారన్నది అతి పెద్ద ప్రశ్నగా ప్రజలకి ఎదురయింది.
ఈ ప్రభుత్వం ఇన్నేసి కోట్ల అప్పులు చేసిందని, మైనింగ్, మద్యం, ఇసుక వంటివి మాఫియాల్లా తయారయ్యాయని, రాజధాని లేదనీ, మెట్రో రాదనీ, పరిశ్రమలు లేవనీ, దోచుకోవడం దాచుకోవడం తప్ప మరేమీ లేదని అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు.
మరి ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి అనుకుంటే, ఈ నాలుగేళ్ళళ్ళో షర్మిళ గొంతుని నొక్కి పట్టి ఉంచిందెవరు?? అసలు తెలంగాణలో పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసాక షర్మిళ అక్కడ ప్రచారంలో ఎందుకు పాల్గొనలేదు? ఇప్పుడు హఠాత్తుగా కాంగ్రెస్ కి ఏపీ మీద ప్రేమ ఎందుకు? ఇంతమంది సీనియర్లు ఉండగా ఏపీ కాంగ్రెస్ కి అధ్యక్షురాలిగా షర్మిళ నే ఎందుకూ? వై.ఎస్ తెలంగాణ రావడాన్ని వ్యతిరేకించారు కనుక షర్మిళ తెలంగాణలో ప్రచారం చేస్తే బెడిసికొడుతందని కాంగ్రెస్ ఆలోచించబట్టే షర్మిళ ను అస్సలు ఒక్క ప్రచారానికి కూడా వాడుకోలేదు.
పాపం, ఈ విషయాలేవి తెలియని షర్మిళ కాంగ్రెస్ రాసి ఇచ్చిన స్క్రిప్ట్ పట్టుకుని ఆంధ్రప్రదేశ్ మీద విమర్ళలు చేస్తున్నారు. ఒకవేళ ఆంధ్ర కాంగ్రెస్ లో షర్మిళ చేరకుండా ఉండి ఉంటే ఇప్పటికి ఈ ప్రశ్నలు అడిగి ఉండేవారా ? కాంగ్రెస్ తో ఒప్పందం చేసుకుని, వైసీపీని దెబ్బ కొట్టడానికి, టీడీపీ రచన ప్రకారం ఏపీలో షర్మిళ అడుగుపెట్టిందా?? ఇలా ఎన్నో ప్రశ్నలు ఇపుడు ఆంధ్ర ప్రజల బుర్రలను తొలిచేస్తున్నాయి.