YS ఆశయాలను జగన్ అమలు చేయడం లేదని షర్మిళ మైకు ముందుకొచ్చిన ప్రతిసారీ పాపం గొంతు చించుకుంటున్నారు. నిజానికి వై.యస్ ఆశయాలను ఆయన చనిపోయిన తర్వాత ఏ పార్టీ కూడా పట్టించుకోలేదు, ఒక్క జగన్ తప్ప. ఆయన చనిపోయాక ఆయన ఫొటోనే తీసి పక్కన పడేసిన కాంగ్రెస్, ఇంక ఆయన ఆశయాలను అమలుచేసే ఉద్దేశ్యాన్ని కూడా ఏ రోజు చూపించలేదు. తర్వాత ప్రజలే కాంగ్రెస్ వైపు చూడటం మానేసారు.
ఇంక, చంద్రబాబు అయితే తర్వాత అధికారంలోకి వచ్చాక ఆంధ్రలో ఫీజు రీయింబర్స్మెంట్, 108 వంటి పధకాలకు తూట్లు పొడవాలనే చూసారు. రాజకీయంగా మైలేజీ వస్తుందన్న కారణంతో తర్వాత కొనసాగించారు.
శాఖల వారీగా వై.యస్ ఆశయాలను, వాటిని కొనసాగించిన విధానాన్నీ చూస్తే…
ఇరిగేషన్ : జలయజ్ఞం క్రింద ఉమ్మడి ఏపీలో YS 84 ప్రాజెక్ట్ లు స్టార్ట్ చేసారు. వెలిగొండ, నెల్లూరు సంగం బ్యారేజ్‌లను జగన్ పూర్తి చేసాడు. గండికోట పులిచింతలకు పరిహారం ఇచ్చి నీళ్లు నిలువ చేసాడు.
చంద్రబాబు ఇరవయ్యేళ్ళుగా పరిపాలిస్తున్న కుప్పానికి నీళ్లిచ్చాడు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చకచకా నడుస్తున్నాయి
పోలవరం విషయంలో బాబు చేసిన తప్పిదాల వలన డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం దెబ్బతింది, దానికి తోడు కరోనా వలన పనుల జాప్యం జరిగింది. దీనిపై కేంద్రం ఆలోచిస్తుండడం తో పోలవరం పనులు కుంటుపడ్డాయి.
ఇల్లు ,ఇళ్ల పట్టాలు : వై.యస్ బ్రతికుండగా ఆచరించాలని అనుకున్న గృహ నిర్మాణాలకై, 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి 22 లక్షల ఇల్లు కడుతున్నారు జగన్. ఇప్పటికే 8 .5 లక్షల ఇళ్ళ నిర్మాణం పూర్తి అయింది కూడా.
డీబీటీ : ప్రత్యక్ష నగదు బదిలీ రూపంలో రూ.2.53 లక్షల కోట్లు, నాన్ డీబీటీ రూపంలో రూ.1.68 కోట్లు
వెరసి రూ.4.21 లక్షల కోట్ల ప్రయోజనాన్ని పేదలకు చేకూర్చారు సీఎం జగన్.
ఇలా జగన్ వైయస్ పూనుకున్న, కోరుకున్న ఆశయాలన్నిటిపై పని చేస్తున్నాడు. అయితే షర్మిళ ఎంత సేపూ ఇప్పుడు పాలిస్తున్న జగన్‌ని అనడంలో కనబరిచిన శ్రధ్ధ, గత ప్రభుత్వాలు, ప్రత్యేకంగా బాబు హయాంలో ఏం చేసారు అనేది ఆలోచించకపోవడం మాత్రం హాస్యాస్పదం.