ఎవరో నిన్ను ముంచడానికి నీ చేతికొక కుక్క తోక అందిస్తే దాన్ని పట్టుకుని రాజకీయ గోదారి ఈదటానికి సిద్ధ పడి చేజేతులా నీ రాజకీయ భవితవ్యాన్ని నాశనం చేసుకోడానికి దిగావు. సరే, ఆ విషయం గ్రహించకుండా కుటుంబాల చీలిక గురించి ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావమ్మా? నలుగురూ నవ్వి పోతారనైనా లేదే?
నీ వ్యక్తిగత విభేదాలను సాకుగా చూపి ప్రజల జీవితాలతో ఆడుకోడానికి రాజకీయ పార్టీ పెడతావా? నీ కుటుంబంలో, నీ సొంత అన్నతో నీకు ఆర్థికంగానో, రాజకీయంగానో విభేదాలుండవచ్చు. దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో నువ్వూ, మీ అమ్మా, మీ అన్నగారూ కూచుని మాట్లాడుకోవాలి తప్ప, ఏకంగా ప్రజోద్ధరణ అనే పేరుతో తెలంగాణ కోడల్ని అంటూ పార్టీ పెట్టేశావు. అంటే నీ విభేదాలే నీ పార్టీకి మూల కారణం తప్ప, నిజంగా నీకు తెలంగాణ ప్రజల మీద ప్రేమో, అభిమానమో ఉండి కాదన్నమాట.
నాలుగు రోజులు గట్టిగా ఒక మాట మీద నిలబడ లేని నీ వాచాలత ప్రదర్శనకు “రాజన్న బిడ్డని” అనే సపోర్ట్ ని తెచ్చుకుని తగిలించుకున్నావు. రాజన్న ఎటువంటి వ్యక్తో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆయన అసంఖ్యాక అభిమానులకు బాగానే తెలుసు.అందుకే నీ ఎత్తులు అక్కడ పారలేదు. తెలంగాణ ప్రజల సమస్యల మీద నీకు ఇసుమంతైనా అవగాహన లేదని గ్రహించిన జనం నిన్ను ఛీ కొట్టిన సంగతి నువ్వు గ్రహించినా, ఎవరికీ ఆ సంగతి తెలీదని నమ్ముతూ పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగిన చందాన నాటకాలు ఆడుతున్నావు.నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు.
నీ స్వలాభం కోసం రెండు సంవత్సరాలు రాజన్న బిడ్డ సేల్స్ టాగ్ తో అరకొర రాజకీయాలు నడిపే వ్యర్థ ప్రయత్నం చేశావు. ఆ తర్వాత ఎన్నికల ముందు చేతులెత్తేసి, ఏ మాత్రం పౌరుషం లేకుండా నీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశావు. “షర్మిల తెలంగాణ వదిలి ఆంధ్రకు పోవాలె” అని రేవంత్ రెడ్డి పదే పదే అన్న మాటల్ని మర్చిపోయి, వాళ్ల పంచనే చేరావు. ఇంతకంటే దిగజారుడు తనం ఏదైనా ఉందంటావా? నిన్ను నమ్మి నీ సొంత పార్టీ వెంట తిరిగిన తెలంగాణ కార్య కర్తలను వంచించి మొండిచెయ్యి చూపించావు.
ఇప్పుడు కాంగ్రెస్ తో చేతులు కలిపి, ఏపీ పిసిసి ప్రెసిడెంట్ పీఠం ఎక్కింది కూడా నీ అన్న మీద శత్రుత్వంతో పగ సాదించడానికే తప్ప ఏపీ ప్రజల మీద ప్రేమో అభిమానమో, బాధ్యతో ఉండి కాదు గా?
అంతేగా షర్మిలమ్మా?
వైయెస్సార్ ని ఎఫ్ ఐ ఆర్ లో చేర్చిన కాంగ్రెస్ పార్టీ ఒక దొంగల పార్టీ అని, రేవంత్ రెడ్డి ఒక దొంగ అని,ఓటుకు నోటు కేసులో దొరికిన ఒక టీడీపీ నాయకుడు అని మాట్లాడిన నోటితోనే “కాంగ్రెస్ పార్టీ లో ఎంతో మంచి అభ్యర్థులు ఉన్నారు సి ఎం కావడానికి” అని మాట్లాడావే… నీతి అనే మాటకు ఎక్కడైనా విలువ ఉందంటావా?
కొడుకు కి కూతురికీ మధ్య నలుగుతున్న నీ తల్లిని గురించి ఏనాడైనా ఆలోచించావా? ధర్మంగా నడుస్తున్న కొడుకు వైపు నిలబడాలా? లేక కుటుంబాన్ని చీల్చి అయినా సరే, ఏదో ఒక రకంగా రాజకీయాల్లో దిగాలని మొండి పట్టు పట్టిన కూతురి వైపు నిలబడాలా ఆమె?
జగనన్న వదిలిన బాణాన్ని.. అంటూ సగర్వంగా ప్రకటించుకుని, అన్న కోసం రాష్ట్రమంతా ప్రచారం చేసిన నువ్వు, ఇవాళ ఆయనకు ఎదురుగా నిలబడి ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ ఉందని ప్రశ్నిస్తున్నావంటే.. నీలోకి నువ్వు తొంగి చూసుకుని ఆత్మ విమర్శ చేసుకునే సమయం ఆసన్నమైందని అనిపించట్లేదా?
వైఎస్ఆర్ మీద ఎఫ్ ఐ అర్ నమోదు చేసిన కాంగ్రెస్ తో చేతులు కలిపిన క్షణాన, ఒక్క సారైనా మేరునగధీరుడు వై యెస్ ముఖం గుర్తుకు రాలేదా?
ఈ ఒక్క ప్రశ్న నిన్ను నువ్వు వేసుకుని నీకు జవాబు దొరికిన రోజు తలెత్తుకుని నిల్చోగలవా? ఆలోచించుకో షర్మిలమ్మా!
రేపు నీ కాంగ్రెస్ పార్టీ కి డిపాజిట్లు కూడా దక్కని రోజున, నువ్వు కళ్ళు తెరిచి కావాలని కోరుకుంటే కోల్పోయిన కుటుంబ బంధాలు తిరిగి నీ దగ్గరికి రావు
గుర్తు పెట్టుకో!