ఆయన్ను పొగుడుతా.. నాకేంటి.. ఆహా.. నాకేంటి అంటున్నా.. పైసలు చేతిలో పడితే కానీ నోరు తెరిచి మీకు కావాల్సిన మాటలు చెప్పను.. ఈ ధోరణిలో ఉన్నాడు పవన్ కళ్యాణ్ అలియాస్ ధనసేనాని. ఎన్నికల్లో అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తూ ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నాడు. అలా అని తన దత్త తండ్రి చంద్రబాబును ఫ్రీగా పొగిడేయడం లేదు. దీనికి కూడా అభ్యర్థుల నుంచి పెద్ద మొత్తంలోనే లాగేస్తున్నాడని పొలిటికల్ సర్కిల్లో నడుస్తున్న టాక్.
‘చంద్రబాబు విజన్ – 2020 అంటుంటే ఏమో అనుకునేవాడిని. ఇప్పుడు హైదరాబాద్‌లో హైటెక్‌సిటీ, మాదాపూర్ వేల మంది ఉద్యోగాలు చేస్తున్న తీరు చూస్తే అదేంటో అర్థమవుతోంది. ఇప్పుడు మోదీ, బాబు విజన్ – 2047 కోసం పనిచేస్తున్నారు. రాబోయే తరాల కోసం బంగారు బాటలు వేసేందుకు కృషి చేస్తున్నారు’ నెల్లూరులో జరిగిన ఉమ్మడి సభలో పవన్ కళ్యాణ్ మాటలివి. ఇదే వ్యక్తి గతంలో టీడీపీతో పొత్తు విరమించుకున్నాక నారా వారిపై విరుచుకుపడ్డాడు. ఇక 2019 ఎన్నికల సమయంలో అయితే మైకు పట్టుకుని ఊగిపోయాడు.
చంద్రబాబు సీఎం అయ్యాక యువతకు ఉద్యోగాలు రాలేదని, ఆయన కొడుకు లోకేశ్‌కు మాత్రం ఇప్పించుకున్నాడని అరిచి మరీ చెప్పాడు. తెలుగుదేశం నాయకులు బాబు అండతో ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలించి అమ్ముకున్నాడని గగ్గోలు పెట్టాడు. ప్రకృతి వనరులను దోచేశారని ఆవేశంగా చెప్పాడు. మహిళలకు భద్రత లేకుండా పోయిందని, అమరావతి పేరుతో భూ కుంభకోణానికి పాల్పడ్డారని.. ఇంకా చాలా అన్నాడు. కట్ చేస్తే 2024 ఎన్నికల ప్రచారంలో మాత్రం ధనసేనాని బాబును పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు. డబ్బు కోసమే ఇలా చేస్తున్నట్లు తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు.
అభ్యర్థుల తరఫున ప్రచారానికి ఒక రేటు తీసుకుంటున్న పవన్.. చంద్రబాబును పొగిడినందుకు ఎక్స్ట్రా అమౌంట్ లాక్కుంటున్నాడని తెలుస్తోంది. పొత్తు పెట్టుకున్నందుకు, తక్కువ సీట్లు తీసుకున్నందుకు బాబు సేనానికి భారీ ప్యాకేజీనే ఇచ్చాడు. ఎన్నికల ప్రచార సభల్లో పొగిడినందుకు మాత్రం అభ్యర్థులు చెల్లించాల్సి వస్తోందంట. అసలు ఐటీ అభివృద్ధిలో నారా వారి పాత్ర శూన్యం. కానీ ఎల్లో మీడియా క్రెడిట్ అంతా ఆయనకే దక్కేలా కథనాలు వండి వార్చింది. ఇలా దేశంలో మరెక్కడా జరగలేదు. చాలా రాష్ట్రాల్లో ఐటీ అభివృద్ధి చెందినా ఏ సీఎం చంద్రబాబులా నేనే.. నేనేనంటూ డబ్బా కొట్టుకోలేదు.
నెల్లూరు సభలో బాబును పొడిగినందుకు టీడీపీ అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పొంగూరు నారాయణ చెరి రూ.2.50 కోట్ల చొప్పున ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే అభ్యర్థుల తరఫున తిరిగినందకు రూ.5 కోట్లు దక్కాయంట. డబ్బు చేతిలో పడింది కాబట్టే ధనసేనాని పొగిడాడు. లేకపోతే 2019లో అంతలా తిట్టిన వ్యక్తికి నేడు ఇలా మాట మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది?