తమిళ నటుడు విజయ్ ఆంటోనీ ఇటీవల నటించిన చిత్రం లవ్ గురు. వినాయకన్ వైద్యనాథన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ నిర్మించిన ఈ చిత్రంలో మృణాళిని రవి హీరోయిన్ గా నటించింది. విజయ్ ఆంటోని నటించిన మొదటి రొమాంటిక్ డ్రామా ఇదే కావడం విశేషం. కాగా ఈ చిత్రానికి భరత్ ధనశేఖర్, రవి రోయ్స్టర్ సంగీతం అందించారు. వీటీవీ గణేశ్, యోగిబాబు, ఇళవరసు, తలైవాసల్ విజయ్ మరియు సుధ ముఖ్య పాత్రలలో నటించిన లవ్ గురు […]
తమిళ నటుడు ధనుష్ వరుసగా తెలుగు దర్శకులకు అవకాశమిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇప్పటికే తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్ సినిమా చేసి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ధనుష్, ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ధనుష్ మరో తెలుగు దర్శకుడితో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే ధనుష్ తెలుగు దర్శకుడు కిషోర్ దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు […]
అంజలి కెరీర్ లో 50 వ చిత్రంగా వచ్చిన గీతాంజలి మళ్ళీ వచ్చింది ప్రేక్షకాదరణ పొందడంలో విఫలమైంది. పదేళ్ల క్రితం అనగా 2014లో రూపొందిన గీతాంజలికి సీక్వెల్ గా రూపొందిన ఈ హారర్ కామెడీ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డి, సునీల్, సత్యం రాజేష్, సత్య కీలక పాత్రల్లో నటించారు. కోన వెంకట్, ఎంవివి సత్యన్నారాయణ నిర్మించిన ఈ చిత్రానికి శివ తుర్లపాటి దర్శకత్వం వహించగా ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు. ఈ చిత్రం ఈనెల 10న అమెజాన్ […]
చాలాకాలంగా హిట్ లేని మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం కన్నప్ప. పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా శివుడిగా ప్రభాస్ నటిస్తాడని ప్రచారం జరిగినా చివరకు శివుడి పాత్రను అక్షయ్ కుమార్ పోషించినట్లు సమాచారం. ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన ఓఎంజి2 లో శివుడి పాత్రను […]
నారా రోహిత్ కొంతకాలం గ్యాప్ తర్వాత నటించిన చిత్రం ప్రతినిధి 2. గతంలో రూపొందిన ప్రతినిధి కి సీక్వెల్ గా రూపొందిన ఈ చిత్రానికి టీవీ5 మూర్తి దర్శకత్వం వహించడం విశేషం. వానరా ఎంటర్టైన్మెంట్స్ & రానా ఆర్ట్స్ బ్యానర్లపై కుమార్ రాజా బత్తుల మరియు ఆంజనేయులు శ్రీ తో కలిసి సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మించిన ఈ చిత్రంలో దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా మరియు సచిన్ ఖేడేకర్ ముఖ్యపాత్రలు పోషించారు. వేసవి సెలవులను దృష్టిలో […]
శివ తుర్లపాటి దర్శకత్వంలో అంజలి ప్రధాన పాత్రలో నటించిన గీతాంజలి చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన గీతాంజలి మళ్ళీ వచ్చింది ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. కోన వెంకట్, ఎంవివి సత్యన్నారాయణ నిర్మించిన ఈ చిత్రంలో అంజలితో పాటు శ్రీనివాస రెడ్డి, సునీల్, సత్యం రాజేష్, సత్య ప్రధాన పాత్రలు పోషించారు. కానీ థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైన ఈ చిత్రం ఓటిటిలో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది.. అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం మే 10 […]
విజయ్ దేవరకొండకి కొంతకాలంగా సరైన హిట్ పడటం లేదు. దిల్ రాజు నిర్మాణంలో గీత గోవిందం డైరెక్టర్ పరుశురామ్ తెరకెక్కించిన ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ గా నిలిచింది. దానికి తోడు సోషల్ మీడియాలో సినిమాపై విపరీతమైన ట్రోలింగ్‌తో పాటు నెగెటివ్ పబ్లిసిటీ జరిగింది. దిల్ రాజుకి భారీ నష్టాలు మిగిల్చిన ప్రాజెక్టుగా ఫ్యామిలీ స్టార్ నిలిచినా మరోసారి దిల్ రాజు విజయ దేవరకొండతో సినిమా ప్రకటించారు. రాజావారు రాణిగారుతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రవికిరణ్ కోలా దర్శకత్వంలో […]
దర్శకుడు అనిల్ రావిపూడిని ముసుగేసి గుద్దితే పదివేలు ఇస్తానని రాజమౌళి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ సరదా సంఘటనకి కృష్ణమ్మ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా మారింది. టాలీవుడ్ నటుడు సత్యదేవ్, అథిర రాజ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా మే 10, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కానుంది. కాగా కృష్ణమ్మ ఈవెంట్‌కు స్టార్ డైరెక్టర్లు రాజమౌళి, కొరటాల శివ, అనిల్ రావిపూడి […]
ఆనంద్ దేవరకొండ తన కెరీర్ లో చేస్తున్న ఫస్ట్ యాక్షన్ మూవీ గం గం గణేశా. తాజాగా ఆ చిత్ర బృందం అదిరిపోయే అప్డేట్ను ఇచ్చింది. ఈ సినిమాను మే 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించింది. హై-లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్న గం గం గణేశాకి ఉదయ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఆనంద్ దేవరకొండ సరసన ప్రగతి శ్రీవాత్సవ హీరోయిన్ గా నటిస్తుంది. బేబీలాంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత […]
డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన టిల్లు స్క్వేర్ భారీ కలెక్షన్స్ కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని సిద్దు జొన్నలగడ్డను స్టార్ గా మార్చి 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన చిత్రంగా టిల్లు స్క్వేర్ నిలిచింది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. కాగా ఈ చిత్రం ప్రస్తుతం ఓటిటి బాట పట్టనున్నట్లు సమాచారం. ఏప్రిల్ 26 నుంచి […]