నారా రోహిత్ కొంతకాలం గ్యాప్ తర్వాత నటించిన చిత్రం ప్రతినిధి 2. గతంలో రూపొందిన ప్రతినిధి కి సీక్వెల్ గా రూపొందిన ఈ చిత్రానికి టీవీ5 మూర్తి దర్శకత్వం వహించడం విశేషం. వానరా ఎంటర్టైన్మెంట్స్ & రానా ఆర్ట్స్ బ్యానర్లపై కుమార్ రాజా బత్తుల మరియు ఆంజనేయులు శ్రీ తో కలిసి సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మించిన ఈ చిత్రంలో దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా మరియు సచిన్ ఖేడేకర్ ముఖ్యపాత్రలు పోషించారు.
వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకుని మే 10న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కాగా ఎన్నికలకు మూడు రోజుల ముందు ఈ చిత్రం రాబోతున్న తరుణంలో రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ చిత్రాన్ని ఎన్నికల ముందు విడుదల చేయనున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కాగా ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన కానీ ఈ మూవీ అనుకోని కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. చివరకు మే 10 న థియేటర్లలో విడుదల కానుంది. ప్రతినిధి 2 చిత్రానికి మహాతిసాగర్ సంగీతం అందిస్తుండగా సిరీ లెల్లా హీరోయిన్ గా నటిస్తుంది.