దర్శకుడు అనిల్ రావిపూడిని ముసుగేసి గుద్దితే పదివేలు ఇస్తానని రాజమౌళి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ సరదా సంఘటనకి కృష్ణమ్మ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా మారింది. టాలీవుడ్ నటుడు సత్యదేవ్, అథిర రాజ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా మే 10, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కానుంది. కాగా కృష్ణమ్మ ఈవెంట్కు స్టార్ డైరెక్టర్లు రాజమౌళి, కొరటాల శివ, అనిల్ రావిపూడి మరియు గోపీచంద్ మలినేని అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమౌళి చేసిన సరదా కామెంట్స్ వైరల్ గా మారాయి.
దేవర సినిమా గురించి అప్డేట్ కావాలని దాంతో పాటు రాజమౌళి సినిమా ఓపెనింగ్ ఎప్పుడో చెప్పాలని దర్శకుడు రాజమౌళిని అనిల్ రావిపూడి ప్రశ్నించారు. రాజమౌళి ఓపెనింగ్ డే రోజున తాను తీసే సినిమా కథ ఎలా ఉంటుంది ఏ జోనర్ లో తెరకెక్కిస్తున్నారు అనేది చెబుతారని, ఆయన తరువాత సినిమా ఓపెనింగ్ డే ఎప్పుడో తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా ఉందని అనిల్ రావిపూడి అనడంతో రాజమౌళి నుండి సరదా సమాధానం ఎదురైంది. అనిల్ రావిపూడిని ఎవరైనా సరే. ఓ కెమెరా పట్టుకొని..వెనకాలే నడుస్తూ.. ఇంకొకరు అనిల్ రావిపూడి మీద ముసుగేసి గుద్దేస్తే 10వేలు ఇస్తానని సరదాగా రాజమౌళి వ్యాఖ్యానించడంతో దయచేసి ప్రైజ్మనీ తగ్గించండి సర్. ఓ రెండు రూపాయలని చెప్పండి. 10వేలు అంటే నిజంగా వచ్చేస్తారని అనిల్ రావిపూడి అనడంతో అందరూ నవ్వుకున్నారు.
ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా తెరకెక్కిస్తున్నారు. RRR విజయం తరువాత జోష్ మీద ఉన్న రాజమౌళి అమెజాన్ అడవుల్లో జరిగే నిధి వేట నేపథ్యంలో ఓ యాక్షన్ అడ్వెంచర్ స్టోరీతో సినిమాని రూపొందిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. కాగా మహేష్ బాబు తొలిసారిగా రాజమౌళితో సినిమా చేయనుండడంతో సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.