చాలాకాలంగా హిట్ లేని మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం కన్నప్ప. పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా శివుడిగా ప్రభాస్ నటిస్తాడని ప్రచారం జరిగినా చివరకు శివుడి పాత్రను అక్షయ్ కుమార్ పోషించినట్లు సమాచారం. ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన ఓఎంజి2 లో శివుడి పాత్రను అక్షయ్ కుమార్ పోషించిన విషయం తెలిసిందే.
కాగా శివుడి పాత్రను పోషించిన అక్షయ్ కుమార్ కి భారీ రెమ్యునరేషన్ ముట్టిందని ప్రచారం జరుగుతుంది. సుమారు ఆరుకోట్ల రూపాయల రెమ్యునరేషన్ అక్షయ్ కుమార్ కి ఇచ్చారని, ఇప్పటికే ఆయన తన పాత్రకు సంబంధించిన షూట్ కూడా కంప్లీట్ చేసుకున్నారని తెలుస్తుంది. ఇదే నిజమైతే చిన్న పాత్ర కోసం ఆరుకోట్ల పారితోషికం తీసుకున్న హీరోగా అక్షయ్ నిలిచిపోతారు. అక్షయ్ కే అంత పారితోషికం ఇస్తే ప్రభాస్ కి ఇచ్చే పారితోషికం ఏ స్థాయిలో ఉంటుందో అనే ప్రచారం కూడా జరుగుతుంది.
ఇదంతా పక్కన బెడితే మంచు విష్ణు కెరీర్ లో భారీ బడ్జెట్ చిత్రంగా కన్నప్ప నిలవనుంది. 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా మోహన్ బాబు కన్నప్ప చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కనీసం కన్నప్పతోనైనా మంచు విష్ణు హిట్ ట్రాక్ ఎక్కుతారో లేదో వేచి చూడాలి..