డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన టిల్లు స్క్వేర్ భారీ కలెక్షన్స్ కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని సిద్దు జొన్నలగడ్డను స్టార్ గా మార్చి 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన చిత్రంగా టిల్లు స్క్వేర్ నిలిచింది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. కాగా ఈ చిత్రం ప్రస్తుతం ఓటిటి బాట పట్టనున్నట్లు సమాచారం.
ఏప్రిల్ 26 నుంచి నెట్ఫ్లిక్స్ లో టిల్లు స్క్వేర్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. కాగా టిల్లు స్క్వేర్ మీద ఉన్న బజ్ తో 18 కోట్లు వెచ్చించి మరీ ఓటిటి హక్కులను నెట్ఫ్లిక్స్ కొనుగోలుచేసినట్లు తెలుస్తుంది. కేవలం మూడు రోజుల్లోనే అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ అయిన టిల్లు స్క్వేర్ ఓటిటిలో కూడా సత్తా చాటుతుందని మేకర్స్ విశ్వసిస్తున్నారు. కాగా మీడియం రేంజ్ టాలీవుడ్ హీరోలకు కూడా అందని ద్రాక్షలా ఉన్న 100 కోట్ల మార్కును సిద్దు జొన్నలగడ్డ లాంటి చిన్న హీరో చేరుకోవడం పెద్ద విశేషమనే చెప్పాలి. మరో పది రోజుల్లో నెట్ఫ్లిక్స్ వేదికగా టిల్లు స్క్వేర్ సందడి చేయనున్న నేపథ్యంలో ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.